పశ్చిమ బెంగాల్ (west Bengal) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) చోటుచేసుకుంది. ఘటనలో 18 మంది మృత్యువాత పడ్డారు. ట్రక్కు (truck)ను ఢీ కొనడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. నబదీప్‌లో తమ సమీప బంధువు అంతిమ సంస్కారాల కోసం వెళ్తున్న మెటాడోర్ వ్యాన్ (van) శనివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. దీంతో అందులో ఉన్న 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు (police) ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో 22 మందికి పైగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దట్టంగా కమ్ముకున్న పొగ మంచు, వ్యాన్ అతివేగమే (High speed) ఈ ప్రమాదానికి (West Bengal accident) కారణమని పోలీసులు నిర్ధారించారు.
10 మంది పురుషులు .. ఆరుగురు మహిళలు..
ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ (driver)తో సహా మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో 10 మంది పురుషులు ఉండగా.. ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నార్త్ 24 పరగణాస్‌లోని బాగ్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్మదన్ ప్రాంతంలో నివసించే వృద్ధురాలు శ్రబానీ ముహురి మరణించింది. ఆమె అంత్యక్రియలు (last rights) నిర్వహించేందుకు కుటుంబంలోని 40 మంది వ్యక్తులు పలు వాహనాల్లో బయలుదేరారు.
మటాడోర్‌లోని నవద్వీప్ శ్మశానవాటికకు వెళ్తున్న క్రమంలో ఆగి ఉన్న ట్రక్కు (Truck)ను వ్యాన్ ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం (post mortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు కృష్ణానగర్ (Krishnagar) ఆస్పత్రిలో చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదే ఏడాదిలో..
కాగా, ఇలాంటి ఘటనే ఇటీవల నిజామాబాద్‌లో జరిగింది. దగ్గరి బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు వెళ్లారు.. అంత్యక్రియలు ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. వెనుక నుంచి వస్తున్న లారీ ముందు ఉన్న ఆటోను డీ కోట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు తోడి కొడళ్లు మృతి చెందారు. మరో ఏడు గురికి తీవ్రగాయలు అయ్యాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడికి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ఆటోలో నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో బంధువు మృతి చెందితే అంత్యక్రియలకు వెళ్లారు. అంత్యక్రియలు పూర్తి అయ్యాక ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి క్రాస్ రోడ్డు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ, ఆటోను వేగంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Road accident, West Bengal