నిజామాబాద్‌లో కారు చక్రాల కింద నలిగిపోయిన పసిబిడ్డ

Nizamabad Car accident: నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ఢీకొని 18 నెలల బాలిక దుర్మరణం చెందింది.

news18-telugu
Updated: September 27, 2020, 7:04 PM IST
నిజామాబాద్‌లో కారు చక్రాల కింద నలిగిపోయిన పసిబిడ్డ
నిజామాబాద్‌లో బాలిక దుర్మరణం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కారు ఢీకొని 18 నెలల బాలిక దుర్మరణం చెందింది. నగరంలోని శివం అపార్ట్మెంట్ కాపలా దారునిగా పని చేస్తున్న వ్యక్తి కుతూరు ఆడుకుంటుంది. అంతలోనే అపార్ట్ మెంట్ లోని వ్యక్తి కారు తీయగా చక్రాల క్రింద సంవత్సరన్నర వయస్సు కలిగిన చిన్నారి ప్రాణాలు వదిలింది. ఇంటికి కాపలా చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న మోహన్ తన కన్న కూతురిని రక్షించుకోలేక పోయాడు. నిజామాబాద్ నగరంలోని శివం అపార్ట్మెంట్ వాచ్‌మెన్ గా మోహన్ విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. మోహన్, చందనలకు ఒక కూతురు ఉంది. మాహ్నవి ఏడాదిన్నర వయస్సు కలిగిన పాప. అపార్ట్మెంట్ ఓనర్ ఎలిజిబెత్ రాణి కుమారుడు కడారి స్టీఫెన్ కారు ఎక్కి ఆన్ చేసి ముందుకు కదిలించడంతో కారు చక్రాల క్రింద పడి పాప మృతి చెందింది. విషయం గమనించిన వారు కాస్తా చిన్నారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే ప్రాణాలు వదిలింది. 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృత దేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద చిన్నారి కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 27, 2020, 7:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading