అరవై అడుగుల బోరుబావిలో 18 నెలల చిన్నారి పడిపోయాడు. ఈ ఘటన హరియాణాలోని బల్సామంద్ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆ బాలుడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బోరులో పడిన ఆ చిన్నారి నాదిమ్..తమ చర్యలకు స్పందిస్తున్నాడని ఆ ప్రాంత డీఎస్పీ జోగిందర్ సింగ్ మీడియాకు తెలిపారు. బోరులో పడిన బాలుడికి శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బావిలోకి ఆక్సిజన్ ట్యూబ్లను వదిలారు. దాంతోపాటు.. బిస్కెట్లు, జ్యూసులను కూడా బోరుబావిలోని బాలుడికి అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ బాలుడు.. తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో బోరుబావిలో పడినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతానికైతే.. బాలుడు సురక్షితంగానే ఉన్నాడని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయి...అంతేకాకుండా.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ నుంచి నిపుణులు వచ్చారని అధికారులు తెలిపారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడానికి, వైద్య తోడ్పాటు అందించడానికి.. ఆ బోరుబావి వద్ద వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు.
Hisar: Rescue operation underway to rescue 18 month-old-boy who fell into a 60-feet deep borewell in Balsamand village, yesterday. #Haryana pic.twitter.com/iGaQ7WU7VZ
— ANI (@ANI) March 22, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Haryana