170 మంది పోలీసులు (Policemen). 9 బృందాలు. మూడు రోజులుగా నల్లగొండ జిల్లా అంతా సోదాలు చేస్తున్నారు. చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా గాలింపు (Searching) చర్యలు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పకటిప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇదంతా ఒక మిస్సింగ్ కేసు కోసమే. అయితే ఇక్కడ మిస్ అయింది ఒక మనిషి అనుకునేరు. కాదు తల లేని మనిషి మొండెం. కిరాతకులు ఆ వ్యక్తి తలను నరికి దేవత కాళ్ల దగ్గర పడేశారు. మొండేన్ని దాచేశారు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ (Nalgonda) జిల్లా చింతపల్లి మండల పరిధిలో ఇటీవల వెలుగుచూసిన మతిస్థిమితం లేని జహేందర్ నాయక్ (Jahendar Naik) హత్యోదంతం కేసు పోలీసులకు జటిలంగా మారింది. కిరాతకులు జహేందర్ తలను తెగ్గోసి మహంకాళి (Mahankali) అమ్మవారి పాదాల వద్ద పెట్టి మొండెం ఆచూకీ లేకుండా చేసిన విషయం విదితమే. గడిచిన మూడు రోజులుగా ప్రత్యేక పోలీసు బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నా బుధవారం నాటికి కూడా మొండెం ఆచూకీ లభ్యం కాలేదు.
కుటుంబానికీ ఇవ్వకుండా..
హత్యోదంతం వెలుగుచూసిన నాటి నుంచి జహేందర్ (Jahendar) తలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచారు. మొండెం ఆచూకీ లభించేంత వరకు అతడి తలను కుటుంబ సభ్యుల కు ఇవ్వకూడదని, కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పరిసరాల్లో నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన మాజీ నక్సలైట్ శ్రీనివాస్‌రెడ్డి దారుణ హత్యనే ఇందుకు ఉదాహరణ అని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బాధిత కుటుంబానికి జహేందర్ తల ఇవ్వలేక.. అతడి మొండేన్ని కనుకొనలేక పోలీసు శాఖ యంత్రాంగం తర్జన భర్జన పడుతోంది.
ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..?
గుట్టలు, చెట్లు అన్నీ..
జహేందర్‌నాయక్ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు (Police higher Officials) ఛేదించేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. హతుడి మొండెం ఆచూకీ కనుగొనేందుకు 170 మంది పోలీసులు తొమ్మిది బృందాలుగా విడిపోయి గాలిస్తున్నాయి. ఇబ్రంహీంపట్నం, తుర్కయాంజల్ మొదలుకుని చింతపల్లి మండల పరిసరప్రాంతాల్లోని చెట్టూ పుట్ట, గుట్టలు వెతుకుతున్నా ఎలాంటి పురోగతి కనిపించలేదు. శనివారం 10 గంటల సమయంలో దేవరకొండ నుంచి శేరిపల్లి వెళ్లే దారి పక్కన నిలిపి ఉంచిన కారు ఎవరిదన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సంప్రదాయం ప్రకారం జహేందర్ అంత్యక్రియలు నిర్వహించుకుంటామని, అతడి మొండేన్ని కనుగొని పూర్తి మృతదేహాన్ని అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసు అధికారులను వేడుకుంటోంది.
జహేందర్ నాయక్ హత్య కేసును ఛేదించేందుకు తమకు సహకరించాలని ఎస్పీ రెమా రాజేశ్వరి బాధిత కుటుంబ సభ్యులను కోరారు. జహేందర్‌నాయక్ తల లభ్యమైన చింతపల్లి మండలం విరాట్‌నగర్ సమీపంలోని శ్రీ మెట్టు మహంకాళి దేవాలయాన్ని బుధవారం ఎస్పీ పరిశీలించారు.
Love marriage killed family: కుటుంబాన్నే బలితీసుకున్న ప్రేమ పెళ్లి.. మొదట కొడుకు.. తర్వాత కోడలు... చివరికి తండ్రి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Murder case, Nalgonda