17 YEARS OLD STUDENT COMMIT SUICIDE JUMPS FROM 15TH FLOOR DUE TO DARK COMPLEXION NOIDA UP FULL DETAILS HERE HSN
తెల్లవారుజామున 4.30 గంటలు.. మార్నింగ్ వాక్ కు వెళ్లి అపార్ట్మెంట్ కు తిరిగొస్తున్న వాళ్లకు కనిపించిందో షాకింగ్ సీన్.. ఓ 17ఏళ్ల కుర్రాడు..
ఘటన జరిగిన అపార్ట్మెంట్ (ఫైల్ ఫొటో)
తెల్లవారుజామున. ఉదయం 4.30 గంటలు. అప్పుడే కొందరు వ్యక్తులు మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి వస్తున్నారు. తమ అపార్ట్మెంట్ ముందుకు రాగానే వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు..
తెల్లవారుజామున. ఉదయం 4.30 గంటలు. అప్పుడే కొందరు వ్యక్తులు మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి వస్తున్నారు. తమ అపార్ట్మెంట్ ముందుకు రాగానే వారికి ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వాచ్ మన్ కు సమాచారం అందించారు. అతడు వచ్చి చూస్తే ఓ యువకుడు నేల మీద రక్తపుమడుగులో పడిపోయి ఉన్నాడు. అతడు 15వ అంతస్థులో ఉండే ఓ కుటుంబానికి చెందిన కుర్రాడని నిర్ధారించారు. వారికి సమాచారం అందించారు. వారు వచ్చి, వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడు అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. 15వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన కారణం ఏంటా అని ఆరా తీస్తే మరో షాకింగ్ నిజం అందరికీ తెలిసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నోయిడాలోని 17 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 11వ తరగతి చదువుతున్న ఆ యువకుడు నోయిడాలోని గౌతమబుద్ధ నగర్ లోని కొత్వాలీలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శనివారం తెల్లవారుజామున 4.30గంటల సమయంలో తాను ఉండే అపార్ట్మెంట్ లో 15వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయమే మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగొస్తున్న కొందరు వ్యక్తులు అతడిని గుర్తించారు. వెంటనే వాచ్ మన్ కు సమాచారం ఇచ్చారు. అతడు ఆ కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు.
అంతా కలిసి ఆసుపత్రికి తరలిస్తే, అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. అయితే ఆ కుర్రాడి గదిలో సూసైడ్ లేఖ వంటిది ఏమీ దొరకలేదు. ఈ విషయమై తల్లిదండ్రులను ఆరా తీస్తే ఓ షాకింగ్ విషయం చెప్పారు. ‘స్కూల్లో తనతో పాటు చదువుకునే ఓ కుర్రాడు, నన్ను నల్లగా ఉన్నావంటూ కామెంట్ చేశాడు‘ అని చెప్పి ఆ యువకుడు బాధపడ్డాడట. కొద్ది రోజులుగా ఇదే విషయమై దిగాలుగా ఉన్నాడనీ, తీవ్రంగా ఆలోచిస్తున్నాడని తల్లిదండ్రులు వాపోయారు. ఈ కారణంగా ఈ ఘోరానికి పాల్పడి ఉంటాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.