ఫోన్లో నీలిచిత్రాలు చూస్తుండగా కనిపించిన బాలిక.. ఆమెపై ఆ కుర్రాడు అత్యాచారం చేయబోతే అడ్డుకోవడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ఓ 17 ఏళ్ల యువకుడు నీలిచిత్రాలను చూస్తూ, వాటి మత్తులో పడి ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. మాట్లాడలేని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె చున్నీతోనే ఉరిబిగించాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ..

 • Share this:
  టెక్నాలజీ ఎంత మేలు చేస్తోందో, అదే స్థాయిలో కీడును కూడా వెంట తెస్తోంది. నేడు ప్రతీ ఒక్క యువకుడి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. చేతిలో స్మార్ట్ ఫోన్, దాంట్లో డేటా బ్యాలెన్స్ ఉంటే చాలు, వాళ్లేం చేస్తున్నారో వారికే తెలియకుండా పోతోంది. వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్న యువత స్మార్ట్ ఫోన్లలో నీలిచిత్రాలను వీక్షిస్తోంది. వాటి మైకంలో పడి దారుణాలకు పాల్పడుతోంది. తాజాగా ఓ 17 ఏళ్ల యువకుడు నీలిచిత్రాలను చూస్తూ, వాటి మత్తులో పడి ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం చేయబోయాడు. మాట్లాడలేని ఆమె అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆమె చున్నీతోనే ఉరిబిగించాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని పొలంలో పారేశాడు. ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయిన ఆ యువకుడిని పోలీసులు పట్టేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగర్ జిల్లాలో కైవాల్ష్ అనే గ్రామంలో ఓ 17 ఏళ్ల యువకుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉపాధి కోసమే అతడు దౌరాయ్ గ్రామం నుంచి కైవాల్ష్ కు వచ్చాడు. అయితే ఫిబ్రవరి 28వ తారీఖున మధ్యాహ్నం సమయంలో ఆ యువకుడు తన స్మార్ట్ ఫోన్లో నీలిచిత్రాలను చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో అటుగా ఓ మూగ బాలిక వచ్చింది. ఆ బాలిక మాట్లాడలేదని అప్పటికే అతడికి తెలిసి ఉండటంతో, దాన్ని అనువుగా తీసుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి పొలంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడి చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆమె వద్ద ఉన్న చున్నీతో ఆ బాలికకు ఉరి బిగించి చంపేశాడు.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  మృతదేహాన్ని దూరంగా తీసుకెళ్లి పొలాల్లోనే కనిపించకుండా పారేశాడు. అయితే ఆ బాలిక రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు భయపడిపోయారు. ఊరంతా వెతికినా కనిపించకపోవడంతో పొలాల్లో వెతికారు. చివరకు ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలిసి ఆ ఊరికి రావడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో ఆ బాలిక బంధువులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. మొత్తానికి ఉన్నతాధికారులు వచ్చి నేరస్థుడిని త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆ బాలిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడానికి ఒప్పుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు ఆ 17 ఏళ్ల యువకుడిని పట్టుకోగలిగారు. తానే నేరం చేశానని అతడు కూడా ఒప్పుకున్నాడు. పోలీసులు అతడి వద్ద ఉన్న మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి మొబైల్ లో 118 నీలిచిత్రాలు ఉన్నాయనీ, వాటి ప్రభావం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని పోలీసులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!
  Published by:Hasaan Kandula
  First published: