• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 17 YEAR OLD MURDERS MOTHER AFTER ROW OVER NOT DIVORCING FATHER MS

నాన్నకెందుకు విడాకులివ్వడం లేదని.. తల్లిని చంపిన తనయుడు

నాన్నకెందుకు విడాకులివ్వడం లేదని.. తల్లిని చంపిన తనయుడు

ప్రతీకాత్మక చిత్రం

మూడేండ్లుగా తమ నుంచి దూరంగా ఉంటున్నా.. విడాకులు కావాలని ఆ భర్త కోరుతున్నా.. తల్లి వినిపించుకోవడం లేదు. దీంతో విసిగెత్తిపోయిన ఆ కొడుకు ఏకంగా తల్లినే హత్య చేశాడు.

  • News18
  • Last Updated:
  • Share this:
    భార్యాభర్తల మధ్య మొదలైన స్పర్థలు.. చివరికి ఆ భార్య ప్రాణం కోల్పోయేలా చేశాయి. ఎన్నిసార్లు అడిగినా ఆ తల్లి వినడం లేదనే కారణంగా ఓ కొడుకు.. కన్నతల్లినే హత్య చేశాడు. తండ్రికి విడాకులివ్వలేదనే కారణంతో ఆ కొడుకు ఏకంగా నవమాసాలు మోసి కని పెంచిన తల్లినే అతి కిరాతకంగా హత్య చేశాడు. భార్యాభర్తల పట్టింపులతో విసిగిపోయిన ఆ కుర్రాడు.. విసిగిపోయి చివరికి ఆమెను చంపేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాలు కింది విధంగా ఉన్నాయి.

    ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తన తల్లిని హత్య చేశాడు. మూడు సంవత్సరాలుగా అతడి తల్లిదండ్రులు విడివిడిగా ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు తండ్రి దగ్గర ఉంటుండగా.. చిన్న కొడుకు, కూతురు తల్లితోని ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి వాళ్లిద్దరూ దూరంగా ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. అయితే మూడు సంవత్సరాలుగా సదరు భర్త.. విడాకులివ్వాల్సిందిగా భార్యకు నోటీసులు పంపుతూనే ఉన్నాడు. కానీ దానికి ఆమె అంగీకరించడం లేదు.

    తల్లిదండ్రుల వ్యవహారం చూసి ఆమె దగ్గర ఉంటున్న కొడుకుకు విసుగెత్తింది. తండ్రి ఎన్నిసార్లు విడాకుల నోటీసులు పంపించినా ఎందుకు తిరస్కరిస్తున్నావని ఆమెతో తరుచూ గొడవకు దిగేవాడు. ఇదే విషయమై కాలేజీలో అతడి స్నేహితులు.. ఆ కుర్రాడిని గేలి చేసేవారు. దీంతో విసిగెత్తిపోయిన ఆ యువకుడు.. నవంబర్ 30 న ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. అతడు రాగానే ఆ తల్లి తీసుకుపోయి అన్నం పెట్టింది. అతడు వేసుకున్న జాకెట్ లో కత్తి ఉండటాన్ని చూసి.. ఇదెక్కడిదని ఆ తల్లి అడిగింది. తన స్నేహితుడిదని.. రేపు ఇచ్చేస్తానని ఆ కుర్రాడు సమాధానం చెప్పాడు. వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని.. తనకు తోడు రావాలని అతడు కోరగా.. దానికి ఆమె అంగీకరించింది. రాత్రి 12.30 సమయం. కొద్దిదూరం వెళ్లగానే ఎవరూ లేని సమయం చూసిన ఆ కుర్రాడు.. తల్లిపై కత్తి తో దాడి చేశాడు. ఆమె వేడుకుంటున్నా వినకుండా.. తల్లి ని హత్య చేశాడు.

    ఇది కూడా చదవండి.. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని.. రాత్రి ప్రియుడింటికి వెళ్లి...

    తన అన్నతో కలిసి బయటకు వెళ్లిన తల్లి ఎంతసేపటికీ రాకపోయేసరికి ఇంట్లో ఉన్న కూతురికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె తన అన్నకు ఫోన్ చేసింది. కానీ అతడి ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడిన ఆ కూతురు ఇరుగు పొరుగు వాళ్లకు సమాచారం అందించింది. వాళ్లు వెళ్లి వెతకగా.. ఒక చెట్టు కింద రక్తపు మడుగులో ఆ తల్లి పడిపోయి ఉంది.

    బాధితురాలి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా.. తల్లిని తానే హత్య చేశానని.. తండ్రికి విడాకులివ్వకపోవడంతోనే చంపానని చెప్పుకొచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని జువైనల్ జైల్ కు తరలించారు.
    Published by:Srinivas Munigala
    First published: