17 YEAR OLD MURDERS GIRLFRIENDS GRANDMOTHER AFTER SHE OBJECTS TO THEIR RELATIONSHIP DETAILS HERE MS
ప్రేమకు అడ్డు పడుతున్నారని.. ప్రియురాలి అమ్మమ్మ, తమ్ముడిని అత్యంత కిరాతకంగా..
ప్రతీకాత్మక చిత్రం
ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచి చూశాడు. అనుకున్నట్టుగానే గురువారం ఇంట్లో అమ్మాయి అమ్మమ్మ, తమ్ముడు తప్ప ఎవరూ లేరు. దీంతో ధైర్యంగా ఆ ఇంట్లోకి వెళ్లిన ఆ యువకుడు.. ఆ అమ్మాయిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఆ యువతి తమ్ముడు, అమ్మమ్మ ప్రతిఘటించారు.
నిండా ఇరవై ఏళ్లు కూడా నిండవు. చదువుకోమని ఇంట్లో తల్లిదండ్రులు కాలేజీకి పంపిస్తే.. చదువు మానేసి ఫ్రెండ్స్ తో సినిమాలు, షికార్లు.. ఇంకా ముందుకెళ్లి పబ్ లు, మందు, సిగరెట్లు.. ఇన్ని అలవాటయ్యాక బైక్ వెనకాల గర్ల్ ఫ్రెండ్ లేకుంటే అది ఇమేజ్ డ్యామేజ్ ఇష్యూ. అర్జంటుగా ఈ హీరోకు ఒక హీరోయిన్.. కొన్నాళ్ల పాటు సినిమాలు, పార్కులు, లాంగ్ డ్రైవ్ లు. వీలైతే అది కూడా. కానీ విషయం ఇంట్లో తెలిస్తే.. యథావిధిగా వాళ్ల చేతిలో చివాట్లు. ప్రేమ విఫలం.. విషాదానికి తట్టుకోలేక చెడు అలవాట్లకు బానిసై.. నేర ప్రవృత్తికి దగ్గరవడం.. ఆ సమయంలో వారికి అనిపించేవి రెండే రెండు. బతికితే ప్రేమించిన వారితో బతకడం.. లేదా ఎదురొచ్చిన వారిని చావగొట్టడం.
అదేం చిత్రమో.. దేశంలో చాలా మంది రెండో దాన్నే ఎంచుకుంటున్నారు. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు కూడా రెండోదే ఎంచుకున్నాడు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే నెపంతో ప్రియురాలి తమ్ముడు, అమ్మమ్మను హత్య చేశాడు. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్ర లోని నాగపూర్ కు సమీపాన ఉండే హజరిపహాద్ గ్రామంలో చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన యువకుడు.. వారి కాలేజీలో ఇంటర్ సెకండ్ ఈయర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమించాడు. ఏడాది కాలంగా వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. వీరిద్దరూ మైనర్లే కావడం గమనార్హం. అయితే విషయం తెలిసిన ఆ యువతి తండ్రి.. ఆమెను సురేంద్ర నగర్ లోని తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి పంపించాడు. ప్రేమ విషయం వారికి చెప్పి.. తనను జాగ్రత్తగా చూసుకోమని అక్కడ్నుంచి బయల్దేరాడు.
విషయం తెలుసుకున్న అమ్మమ్మ.. ఆ యువతి తమ్ముడు.. ఆమెపై నిఘా పెట్టారు. ఆమె ఏం చేస్తుంది..? ఎటు వెళ్తుంది..? ఎవరితో ఏం మాట్లాడుతుందనేది అంతా వారి నిఘా నీడలో ఉన్నది. తన చేతికి ఫోన్ కూడా ఇవ్వడం లేదు. దీంతో మన హీరోగారు విరహా వేదనను తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఆమెను కలుసుకోవాలని పలు పథకాలు రచించినా.. అవి కుదరలేదు. ఇక లాభం లేదనుకుని పెద్ద ప్లాన్ వేశాడు.
ఆ ఇంట్లో ఎవరూ లేని సమయం కోసం వేచి చూశాడు. అనుకున్నట్టుగానే గురువారం ఇంట్లో అమ్మాయి అమ్మమ్మ, తమ్ముడు తప్ప ఎవరూ లేరు. దీంతో ధైర్యంగా ఆ ఇంట్లోకి వెళ్లిన ఆ యువకుడు.. ఆ అమ్మాయిని తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఇది చూసి ఆ అమ్మాయి అమ్మమ్మ ప్రతిఘటించింది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆ వృద్ధురాలిపై ఒక్క వేటు వేశాడు. కత్తి పోటుతో ఆమె అక్కడే పడిపోయింది. నేల మీద రక్తం. ఇది చూసిన అమ్మాయి తమ్ముడు.. వారిని అడ్డుకోవడానికి వెళ్లగా.. అతడిని బాత్ రూంలోకి పట్టుకొచ్చి అక్కడే కడుపులో పొడిచాడు దుండగుడు. అనంతరం అక్కడ్నుంచి పరారయ్యాడు.
విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి అక్కడకు చేరుకున్నాడు. కొడుకు, అత్తగారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు. అనంతరం ఆ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలాఉండగా.. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన చెలరేగింది. ఆ యువకుడు వేరే మతానికి చెందిన వ్యక్తి అని.. ఇది లవ్ జిహాద్ అని.. పలు హిందూత్వ సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.