Shocking Incident: లోదుస్తులు దొంగిలించాడని గదిలో పెట్టి తాళమేసిన భార్యాభర్తలు.. పోలీసులు వచ్చేలోపు ఊహించనిది జరిగింది..

ప్రతీకాత్మక చిత్రం

గాంధీ నగర్‌లో రవి(24) తన భార్య, తమ్ముడితో కలిసి నివాసముంటున్నాడు. వారికి పొరుగునే ఓ 17 ఏళ్ల బాలుడు తన కజిన్‌‌తో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లో ఎవరికీ తెలియకుండా నీలిచిత్రాలు చూస్తూ పెడతోవ పట్టాడు. ఆ నీలి చిత్రాల్లో చూపినట్టుగా చేయాలనుకుని రవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతని, అతని భార్య లోదుస్తులను దొంగిలించి వాటితో తాననుకున్నది చేసి ఏం తెలియనట్టుగా ఉండేవాడు.

  • Share this:
    భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ లోదుస్తులు దొంగిలించి పారిపోతున్న ఓ 17 ఏళ్ల బాలుడిని భార్యాభర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని తమ ఇంట్లోని గదిలోనే ఉంచి బయటకు రాకుండా తాళం వేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకుని తలుపు తీసి చూడగా ఆ బాలుడు ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. ఈ షాకింగ్ ఘటన భోపాల్‌లో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని గాంధీ నగర్‌లో రవి(24) తన భార్య, తమ్ముడితో కలిసి నివాసముంటున్నాడు. వారికి పొరుగునే ఓ 17 ఏళ్ల బాలుడు తన కజిన్‌‌తో కలిసి ఉంటున్నాడు. ఆ బాలుడు చిన్న వయసులోనే స్మార్ట్‌ఫోన్‌లో ఎవరికీ తెలియకుండా నీలిచిత్రాలు చూస్తూ పెడతోవ పట్టాడు. ఆ నీలి చిత్రాల్లో చూపినట్టుగా చేయాలనుకుని రవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతని, అతని భార్య లోదుస్తులను దొంగిలించి వాటితో తాననుకున్నది చేసి ఏం తెలియనట్టుగా ఉండేవాడు. కొన్ని రోజులుగా బయట ఆరేసిన తమ లోదుస్తులు మాయమవుతుండటంతో ఆ భార్యాభర్తలకు అనుమానం వచ్చింది.

    ఈ క్రమంలోనే.. ఆ 17 ఏళ్ల బాలుడు రవి ఇంట్లో ఎవరూ లేరనుకుని వారి లోదుస్తులను దొంగతనం చేశాడు. పారిపోతుండగా అప్పటికే బయట కనిపించకుండా దాక్కున్న రవి, అతని భార్య ఆ బాలుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇవేం పనులంటూ మందలించారు. అంతటితో ఆగకుండా.. పోలీసులకు సమాచారం అందించాలని భావించి ఆ బాలుడిని ఇంట్లో పెట్టి బయట తాళమేశారు.

    ఇది కూడా చదవండి: Oyo: ఆ ఓయో హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం.. వెళ్లి చూస్తే ఏముంది..

    తలుపు తీయాలని.. ఇంకెప్పుడూ ఇలా చేయనని.. పోలీసులను పిలవద్దని ఆ బాలుడు ఏడుస్తూ ఎంత చెప్పినా ఆ భార్యాభర్తలు వినిపించుకోలేదు. రవి తమ్ముడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని తలుపు తీసి చూడగా భయంతో ఒళ్లంతా చెమటలు పట్టి ఆత్మహత్య చేసుకుని ఆ బాలుడు ఉరేసుకుని విగత జీవిగా కనిపించాడు. ఊహించని ఘటనతో ఆ భార్యాభర్తలు నిర్ఘాంతపోయారు. పోలీసులు ఆ బాలుడి అన్న ఫిర్యాదుతో ఆ భార్యాభర్తలపై ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం.. ఆ బాలుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
    Published by:Sambasiva Reddy
    First published: