ఇంటర్ విద్యార్థినికి హార్ట్ ఎటాక్‌... క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన కీర్తన

ప్రతీరోజులాగానే పొద్దున్నే లేచి రెడీ అయి కాలేజ్‌కు వెళ్లింది. ఒక్కసారిగా క్లాస్‌రూమ్‌లోనే కీర్తన కుప్పకూలింది.

news18-telugu
Updated: August 31, 2019, 12:59 PM IST
ఇంటర్ విద్యార్థినికి హార్ట్ ఎటాక్‌...  క్లాస్‌రూమ్‌లోనే కుప్పకూలిన కీర్తన
నమూనా చిత్రం
  • Share this:
20 ఏళ్లు కూడా నిండని విద్యార్థిని కార్డియక్ అరెస్ట్‌తో మృతి చెందింది. 17 ఏళ్ల కీర్తన వెలిమలలోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ సెకండీయర్ చదువుతోంది. ప్రతీరోజులాగానే పొద్దున్నే లేచి రెడీ అయి కాలేజ్‌కు వెళ్లింది.  ఒక్కసారిగా క్లాస్‌రూమ్‌లోనే కీర్తన కుప్పకూలింది. దీంతో ఆమెను కాలేజ్ సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. అయితే కీర్తన మృతికి కార్డియక్ అరెస్ట్ కారణమని వైద్యులు నిర్ధారించారు. కీర్తన తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


First published: August 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>