యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కత్తితో ఆమె..

Delhi Rape case: ఐదుగురు యువకులు ఓ యువతి(17)పై గ్యాంగ్ రేప్ చేశారు. ఓ చోట అఘాయిత్యానికి పాల్పడి, మరో చోటుకు తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై విరుచుకుపడ్డాడు.

news18-telugu
Updated: July 8, 2019, 3:06 PM IST
యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్.. ఆ తర్వాత కత్తితో ఆమె..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ ఘటన మొదలు ఇప్పటి వరకు వందలాది రేప్ కేసులు నమోదవుతున్నాయి. వీటి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా, చట్టాలు చేస్తున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతోంది. తాజాగా, ఐదుగురు యువకులు ఓ యువతి(17)పై గ్యాంగ్ రేప్ చేశారు. ఓ చోట అఘాయిత్యానికి పాల్పడి, మరో చోటుకు తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై విరుచుకుపడ్డాడు. తమకు అడ్డు చెబుతోందని కత్తితో ఆమె జట్టు కూడా కత్తిరించి, శారీరకంగా వేధించారు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని దక్షిణ ప్రాంతం సాగర్‌పూర్‌లో చోటుచేసుకుంది. గత వారం జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు కామాంధుల్లో ఇద్దరు ఆ యువతి సోదరుడి స్నేహితులు కావడం గమనార్హం.

అయితే, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. కేసు నమోదు చేసుకోవాల్సింది పోయి.. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. దీనిపై పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇక, అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...