కన్నకూతురిని గొలుసులతో కట్టేసి ఇంట్లోనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి...

తనను కట్టేసి తండ్రి గత కొన్ని రోజులుగా అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. ఆమె తల్లి గృహహింసకు తట్టుకోలేక ఏడేళ్ల కిందటే భర్తను వదిలేసి వెళ్లి, మరో పెళ్లి చేసుకుందని మేనమామ చెప్పారు. అయితే కూతురు మాత్రం తండ్రితోనే ఉంటోంది.

news18-telugu
Updated: December 3, 2019, 4:09 PM IST
కన్నకూతురిని గొలుసులతో కట్టేసి ఇంట్లోనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
కన్నతండ్రే 17 ఏళ్ల కూతురిపై ఇంట్లోనే అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజస్థాన్ జలోర్‌లో జరిగిన ఈ ఘోరంలో జరిగింది. తండ్రి మరో మహిళతో ఉండడం  చూసిన తర్వాత తనను  గొలుసులతో తన కాళ్లు చేతులు కట్టేసి అత్యాచారం చేశాడని బాధిత మహిళ తెలిపింది. అనంతరం ఆమె ఇంట్లోంచి తప్పించుకుని పోయిన తర్వాత మేనమామ ఆమె తరఫున పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గదిలో బంధించి కన్నతండ్రి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. ఇదిలా ఉంటే ఏడేళ్ల కిందటే తల్లి గృహహింసకు తట్టుకోలేక భర్తను వదిలేసింది. కాగా కూతురు మాత్రం తండ్రితోనే ఉంటోంది.

గతవారం బాధిత యువతి ఇంట్లోంచి తప్పించుకుని, గొలుసులతోనే మేనమామ పొలం వద్దకు వచ్చింది. ఆ తర్వాత మేనమామ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని, ఆ అమ్మాయిని వైద్య పరీక్షకు పంపుతామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>