హైదరాబాద్‌లో దారుణం... 17 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌కి ఏమైంది? వరుస దారుణాలు ప్రజల్లో భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. మహిళలు, అమ్మాయిల భద్రతను ప్రశ్నిస్తున్నాయి.

news18-telugu
Updated: January 24, 2020, 1:16 PM IST
హైదరాబాద్‌లో దారుణం... 17 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లో దారుణం... 17 ఏళ్ల యువతిపై హత్యాచారం
  • Share this:
నిన్న తెలంగాణలో ఓ బాలికను... ముగ్గురు యువకులు... కారులో ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన కేసులో... పోలీసులు ఆ నిందితుల కోసం వేటాడుతూనే ఉన్నారు. ఇంతలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌... చిలకలగూడ... వారాసిగూడలో జరిగిందీ విషాద దారుణం. 17 ఏళ్ల యువతి రెండు అపార్ట్‌మెంట్ల మధ్య శవమై కనిపించింది. ఎవరో ఆమెను అపార్ట్‌మెంట్ పై నుంచీ కిందకు విసిరేసినట్లుగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఈ కేసులో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. యువతి ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది.

ఇటీవల దిశ హత్యాచారం కేసులో నిందితుల్ని ఎన్‌కౌంటర్ చేశాక... కొన్ని రేప్ కేసులు తెరపైకి వచ్చాయి. తాజాగా... సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో 16 సంవత్సరాల మైనర్ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగు చూసింది. స్థానిక చక్రపురి కాలనీలో బాలికను ఓ షాప్ వద్ద బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేసి, ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మద్యం తాగి దుండగులు అత్యాచారం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించగా, సెల్ ఫోన్ ఆధారంగా బాలిక ఆచూకీని పసిగట్టి, ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు