రేపిస్ట్ మర్మాంగాన్ని కోసేసిన 17 ఏళ్ల బాలిక... అఘాయిత్యం చేయబోయిన...

తలపై కత్తిపెట్టి అత్యాచారానికి యత్నించిన యువకుడు... అదే కత్తి తీసుకుని అతని మర్మాంగాన్ని కోసేసిన బాలిక...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 9:09 PM IST
రేపిస్ట్ మర్మాంగాన్ని కోసేసిన 17 ఏళ్ల బాలిక... అఘాయిత్యం చేయబోయిన...
రేపిస్ట్ మర్మాంగాన్ని కోసేసిన 17 ఏళ్ల బాలిక... అఘాయిత్యం చేయబోతే... (ప్రతికాత్మక చిత్రం)
  • Share this:
ఆమె వయసు 17 ఏళ్లు. మైనారిటీ కూడా బాలిక. భయపెడితే బెదిరిపోయి లొంగిపోతుందని భావించిన ఓ యువకుడు... ఆమె తలపై కత్తిపెట్టి అత్యాచారానికి యత్నించాడు. అయితే అదే కత్తి తీసుకుని, అతని మర్మాంగాన్ని కోసేసింది ఆ బాలిక. సోషల్ మీడియాలో పెను సంచలనం క్రియేట్ చేస్తున్న ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది. హర్యానా రాష్ట్రంలోని ఇంచోలి ఏరియాలో నివాసం ఉంటున్న ఓ 17 ఏళ్ల బాలిక... కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఒంటరిగా గ్రామశివారులో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఆమెను గమనించి, వెనకే రహస్యంగా వెంబడించాడు అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల రాయిస్. పొదల్లోకి వెళ్లిన తర్వాత కత్తితో ఆమెపైకి దూకిన రాయిస్... అరవకుండా నోరు మూసేశాడు. కత్తి తలపై పెట్టి, అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అరిస్తే చంపేస్తానని బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి పాల్పడడానికి యత్నించాడు.

ఈ హఠాత్ సంఘటనతో షాక్‌కు గురైన ఆమె... జరగబోయే ప్రమాదాన్ని ఊహించి తేరుకుంది. రాయిస్ మర్మాంగాన్ని బయటికి తీసి, అత్యాచారం చేసేందుకు యత్నిస్తున్న సమయంలో అతని చేతిలో కత్తి లాక్కుంది. బలంగా అతని మర్మాంగంపై ఒక్క వేటు వేసింది. కత్తిపోటు బలంగా తగలడడంతో అతని మర్మాంగం తెగి బడింది. నొప్పి భరించలేక రాయిస్ కేకలు వేశాడు. అతని కేకలు విని, సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు... రాయిస్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో రాయిస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు... బాలిక రక్షణ కోసం గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలిక, నిందితుడు ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలో సెక్యూరిటీని ఏర్పాటుచేశారు పోలీసులు. కేసు దర్యాప్తులో ఉంది.
First published: May 2, 2019, 9:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading