17 YEAR OLD DIES AFTER FIGHT WITH SCHOOLMATES OVER CASTE WRIST BAND IN TAMILNADU PAH
OMG: తరగతిలో పరస్పరం దాడులు చేసుకున్న స్టూడెంట్స్.. ఒకరు మృతి .. కారణం ఏంటంటే..
సెల్వ సూర్య (ఫైల్)
Tamil nadu: పాఠశాలలో విద్యార్థులు రబ్బర్ బ్యాండ్ విషయంలో వాగ్వాదానికి దిగారు. అది కాస్త.. అదుపు తప్పి కొట్టుకోవడం వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులు మరో యువకుడిపై దాడికి పాల్పడ్డారు.
Caste Wrist Band issue boy Dies in tamilnadu: తిరునెల్వేలీలో దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. స్థానికంగా ఉన్న పాఠశాల విద్యార్థులు పరస్పరం కొట్టుకున్నారు. సాధారణంగా స్కూల్ లలో కొన్ని సార్లు.. విద్యార్థుల మధ్య కులాల ప్రస్తావన వస్తుంది. దీంతో కొందరు తాము ఉన్నత కులమని, మిగతావారిని తక్కువ చేసి చులకనగా చూస్తుంటారు. ఒక్కొసారి ఈ క్రమంలో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఉదంతం వార్తలలో నిలిచింది.
పోలీసులు తెలిపిన వివరాలు.. తిరునెల్వేలీ జిల్లాలోని స్థానికంగా ఉన్న పాఠశాలలో విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. అది గొడవల వరకు వెళ్లింది. ఒక విద్యార్థి రబ్బర్ రిస్ట్ బ్యాండ్ ను వేసుకుని స్కూల్ కు వచ్చాడు. దాని రంగు ఒక మతాన్ని సూచిస్తుంది. దీంతో మిగతా ఇద్దరు దానిపై వాదనలకు దిగారు. అది కాస్త గొడవల వరకు వెళ్లింది. దీంతో వారు.. పాఠశాలలో ఆవరణలో పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే, వారిని గొడవను ఆపడానికి మరో విద్యార్థి కల్గచేసుకున్నాడు. వీరు కోపంతో అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సెల్వ సూర్య(17) విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అతని తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది.
అతడు సంఘటన స్థలంలోనే కుప్పకూలిపడిపోయాడు. వెంటనే స్కూల్ యాజమాన్యం అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఏప్రిల్ 25 న జరిగింది. అప్పటి నుంచి బాలుడిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతని తలలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. కాగా, బాలుడికి చికిత్స అందిస్తుండగా.. ఏప్రిల్ 30 న చికిత్స తీసుకుంటూ చనిపోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుల కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ముందు జాగ్రత్తగా పాఠశాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. దాడికి పాల్పడిన విద్యార్థులను అదుపులోనికి తీసుకున్నారు. వారిని జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.