Home /News /crime /

17 YEAR OLD BOY NABBED FOR RAPING TWO YEAR OLD GIRL IN MOHALI PVN

Shocking : రెండేళ్ల చిన్నారిపై యవకుడు అత్యాచారం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Rape on child: చిన్నారి తల్లిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత చిన్నారిని తల్లి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. చికిత్స అనంతరం పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.

ఇంకా చదవండి ...
Two year old girl rapped : దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. రెండేళ్ల చిన్నారి నుంచి 60ఏళ్ల వృద్ధురాలి వరకు.. అందరు బాధితులుగా మారుతున్నారు. తాజాగా పంజాబ్​ రాష్ట్రంలోని మొహాలీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీలో కార్టూన్​ చూస్తున్న రెండేళ్ల చిన్నారిపై 17ఏళ్ల యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం జరిగింది.

పోలీసు తెలిపిన వివారాల ప్రకారం...ఓ మహిళ తన రెండేళ్ల చిన్నారి కార్టూన్లు చూస్తానని అడగడంతో చిన్నారిని పక్కనే ఉన్న యువకుడి ఇంట్లోకి తీసుకెళ్లి దింపింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లో నుంచి అరుపులు, ఏడుపు వినిపించాయి. తల్లి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లింది. కూతురిపై యువకుడు అత్యాచారానికి, లైంగిక దాడికి పాల్పుడుతుండటాన్ని ఆ మహిళ చూసింది. చిన్నారి తల్లిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత చిన్నారిని తల్లి వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లింది. చికిత్స అనంతరం పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సెక్షన్​ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్​ కస్టడీకి తరలించారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Child rape, Crime news, Punjab

తదుపరి వార్తలు