Home /News /crime /

17 PERSONS ARRESTED IN POCSO ACT WHO HARASSED A 15 YEAR OLD GIRL IN SRINGERI HSN

తల్లిదండ్రుల మరణం.. ఒంటరైన 15 ఏళ్ల బాలిక.. కూతురిలా చూసుకుంటానంటూ ఓ మహిళ ఆమెను తీసుకెళ్లి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ 15 ఏళ్ల వయసున్న బాలికపై ఏకంగా 17 మంది కీచకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నాలుగు నెలలుగా వారి దారుణాలను ఆ బాలిక తట్టుకుంటూనే ఉంది. చుట్టు పక్కల వారు ఆ విషయాన్ని బాల బాలికల సంరక్షణ కేంద్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఇంకా చదవండి ...
    ప్రస్తుత సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోతోంది. కన్న తండ్రే కూతుళ్లపై లైంగిక దాడి చేస్తున్న ఉదంతాల గురించి వింటున్నాం. వరుసకు సోదరుడే యువతులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనల గురించి వింటున్నాం. బంధువులు, స్నేహితులే కామాంధుల్లా మారి అమాయక యువతులపై మానభంగాలకు పాల్పడుతున్న దారుణాలు కోకొల్లలు. నిర్భయ వంటి కఠిన చట్టాలను తెచ్చినా కానీ మృగాళ్లు నిర్భయంగా నీచాలకు పాల్పడుతున్నారు. అత్యాచార ఘటనలు ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా బెంగళూరులోని శృంగేరి ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ 15 ఏళ్ల వయసున్న బాలికపై ఏకంగా 17 మంది కీచకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. నాలుగు నెలలుగా వారి దారుణాలను ఆ బాలిక తట్టుకుంటూనే ఉంది. చుట్టు పక్కల వారు ఆ విషయాన్ని బాల బాలికల సంరక్షణ కేంద్రం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

    ఓ 15 ఏళ్ల బాలికకు కొన్నాళ్ల క్రితం తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. దీంతో ఆ బాలిక సంరక్షణను తాను చూసుకుంటానంటూ ఓ బంధువురాలు శృంగేరికి తీసుకుని వచ్చింది. అక్కడ ఆ బాలిక చదువుకుంటూ ఇంట్లో పనులను కూడా చూసుకునేది. ఈ క్రమంలోనే పక్కింటి కుర్రాడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడితోపాటు మరో 16 మంది కూడా ఆమె కుటుంబ పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆ బాలికను హింసించసాగారు. నాలుగు నెలలుగా వారి అకృత్యాలను ఆ బాలిక భరిస్తూనే ఉంది. తన సంరక్షణ బాధ్యతలను చూస్తున్న బంధువురాలికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. అయితే ఆ బాలిక పరిస్థితిన చూసి చలించిపోయిన ఆ కాలనీ వాసుల్లో ఒకరు జిల్లా మహిళా సంరక్షణ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నేరుగా ఆ బాలికతో మాట్లాడారు. భయపడకుండా నిజం చెప్పమని పోలీసులు కోరారు. దీంతో ఆ బాలిక తన బాధనంతా వెళ్లగక్కింది. వెంటనే పోలీసులు ఆ బాలికను చిక్కమంగళూరులో ఉన్న బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించి ఆమె బాగోగులను అధికారులకు అప్పగించారు. ఆ బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన 17 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ బాలిక బంధువురాలి పాత్రపై కూడా అనుమానంతో ఆమెను కూడా అదుపులోకి విచారణ చేస్తున్నారు. కేసును త్వరలోనే పరిష్కరిస్తామనీ, బాధితురాలికి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, CYBER CRIME, Husband kill wife, Wife kill husband

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు