Lightning Strikes : అయ్యయ్యో..ఎంత దారుణం: పిడుగులు పడి 17మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా ఆరు మరణాలు నమోదయ్యాయి. వైశాలి (ముగ్గురు), బంకా మరియు ఖగారియా (ఇద్దరు చొప్పున), ముంగేర్, కతిహార్, మాధేపురా మరియు సహర్సాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు తెలిపారు,
17 Died In Lightning Strikes: బీహార్(Bihar)లో శనివారం రాత్రి నుంచి పిడుగులు పడి ఇప్పటివరకు 17 మంది చనిపోయారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా ఆరు మరణాలు నమోదయ్యాయి. వైశాలి (ముగ్గురు), బంకా మరియు ఖగారియా (ఇద్దరు చొప్పున), ముంగేర్, కతిహార్, మాధేపురా మరియు సహర్సాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని అధికారులు తెలిపారు, పిడుగులు పడి 17 మంది మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది.
మరోవైపు,ఒడిశా రాష్ట్రంలో కూడా పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నువాపాడా జిల్లాలోని మల్లికాముండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. తీర్థనాగ్, లక్ష్మణ్ నాగ్, చూడామణి నాగ్, గన్సాగర్ నాగ్లను మృతులుగా గుర్తించారు. ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా పిడుగు పడడం వల్ల ఈ దారుణం జరిగింది. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కోమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇక,వరుణ బీభత్సానికి అసోం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రుతుపవనాలకు ముందు కురిసిన వర్షాలు కారణంగా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగం..నీటిలోనే ఉంది. అసోంలోని 32 జిల్లాల్లోని 4 వేల 296 గ్రామాలకు చెందిన 30 లక్షల 99 వేల 762 మందిపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. మొత్తం 514 పునరావాస శిబిరాల్లో లక్షా 56 వేల 365 మంది తలదాచుకుంటున్నారు. వేల హెక్టార్ల పంట నీట మునిగింది. కల్వర్టులు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తాజాగా ముగ్గురు మరణించారు. మేఘాలయాలోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. చిరంపుంజిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక త్రిపుర రాజధాని అగర్తలాను భారీ వరదలు ముంచెత్తాయి. అగర్తలాలో 60 ఏళ్ల తర్వాత మూడవ అత్యధిక వర్షం పాతం నమోదైంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.