OMG : ఆదివాసీ తెగల మధ్య ఘర్షణ..168మంది మృతి,98మందికి తీవ్ర గాయాలు
ఆదివాసీ తెగల ఘర్షణల్లో 168 మంది మృతి
168 Killed In Clashes : 8 మంది చనిపోయిన తర్వాత అధికారులు భారీగా బలగాలను మోహరించారు. అయినప్పటికీ హింసను ఆపలేకపోయారు. దార్ ఫూర్ ప్రాంతంలో కొన్ని ఆదివాసీ వర్గాలకు అస్సలు పడదు.
Clashes Between Rival Groups : అరబ్బులు, అరబ్బుయేతర ఆదివాసీల మధ్య తీవ్ర హింస చెలరేగింది. గురువారం సుడాన్(Sudan) దేశంలోని పశ్చిమ దార్ ఫూర్ ప్రావిన్షియల్ రాజధాని జెనెనాకు తూర్పున 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెనిక్లో గుర్తు తెలియని దుండగుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చడంతో ఆ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. మొల్లగా ఆదివారం నాటికి హింస ఉగ్రరూపం దాల్చింది. ఈ ఘటనలో 168 మంది దుర్మరణం చెందగా.. మరో 98 మంది తీవ్రంగా గాయపడ్డారు. దార్ ఫూర్(Darfur Violence)లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే ఓ సంస్థ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు.
జాన్ జావీద్ అనే మిలీషియాలు ఆదివారం క్రినెక్ లో ఆయుధాలతో దాడి చేసి ఇండ్లను లూటీ చేసి, ఆ తర్వాత వాటిని తగలబెట్టారని తెలిపారు. క్రీనిక్ తర్వాత ఘర్షణలు జెనీనాకు వ్యాపించాయి. మిలీషియా సాయుధులు నగరంలో ఓ ఆస్పత్రిపై దాడి చేశారు. గాయాలతో అప్పటికే అక్కడ చికిత్స పొందుతున్న వారిపై కాల్పులుజరిపారని హాస్పిటల్ డాక్టర్ సలాహ్ సలేహ్ పేర్కొన్నారు. గురువారం మొదలైన హింసలో 8 మంది చనిపోయిన తర్వాత అధికారులు భారీగా బలగాలను మోహరించారు. అయినప్పటికీ హింసను ఆపలేకపోయారు. దార్ ఫూర్ ప్రాంతంలో కొన్ని ఆదివాసీ వర్గాలకు అస్సలు పడదు. అందుకే ఇక్కడ గత కొన్ని నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తెగల మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. ప్రధానంగా పచ్చిక బయళ్లు, నీటి కోసం తరుచూ ఘర్షణలు చెలరేగుతుంటాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో మూడలక్షల మంది వరకు మృతి చెందగా.. 2.5 మిలియన్ల మంది జనం నిరాశ్రయులయ్యారు. గత సంవత్సరం తిరుగుబాటు తర్వాత దేశం సంక్షోభంలో చిక్కుకుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.