హోమ్ /వార్తలు /క్రైమ్ /

Karnataka: ఘోరం.. ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి 16 ఏళ్ల కుర్రాడు ఎక్కి.. మొబైల్ పైకెత్తి ఫొటో క్లిక్ మనిపిస్తోంటే..

Karnataka: ఘోరం.. ఆగి ఉన్న గూడ్సు రైలు పైకి 16 ఏళ్ల కుర్రాడు ఎక్కి.. మొబైల్ పైకెత్తి ఫొటో క్లిక్ మనిపిస్తోంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ 16 ఏళ్ల యువకుడికి సెల్ఫీలంటే పిచ్చి. సెల్ఫీల కోసం ఎంతటి సాహసానికైనా, రిస్కీ ఫీట్ కైనా వెనకాడడు. ఆ గుణమే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆగి ఉన్న ఓ గూడ్సు రైలు మీదకు ఎక్కి సెల్ఫీల కోసం ప్రయత్నించాడు. చివరకు..

ఈ తరం యువత సెల్ఫీ పిచ్చిలో పడి లోకాన్నే మర్చిపోతోంది. వెరైటీ వెరైటీ లొకేషన్లలో సెల్ఫీలు తీసుకోవడం, ఆ ఫొటోలను నెట్టింట తమ ఖాతాల్లో పోస్ట్ చేయడం, వాటికి వచ్చే లైకులు, కామెంట్స్, షేర్లను చూసి తెగ మురుసిపోవడం. ఇదే ప్రస్తుతం మెజారిటీ యూత్ చేస్తున్న పని. సెల్ఫీల మోజులో పడి రిస్కీ ఫీట్లకు కూడా వెనకాడటం లేదు. ఎత్తైన కొండలనైనా ఎక్కేస్తున్నారు. నదుల్లోకో, చెరువుల్లోకో దిగి సెల్ఫీలను క్లిక్ మనిపిస్తున్నారు. వేగంగా వెళ్తున్న ట్రైన్ లోంచి బయటకు వంగి మరీ ఫొటోలను తీసుకుంటున్నారు. అదే ట్రైన్ పట్టాలపై పడుకుని రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకుని అక్కడి నుంచి తృటిలో ప్రాణాలను తప్పించుకుంటున్నారు. చివరకు సెల్ఫీలతో చావును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో సెల్ఫీల పిచ్చిలో పడిన ఓ కుర్రాడి ప్రాణాల మీదకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహ్మద్ దిషాన్ అనే 16 ఏళ్ల యువకుడికి సెల్ఫీలంటే పిచ్చి. సెల్ఫీల కోసం ఎంతటి సాహసానికైనా, రిస్కీ ఫీట్ కైనా వెనకాడడు. ఆ గుణమే ఇప్పుడు అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. మంగళూరులో ఆగి ఉన్న ఓ గూడ్సు రైలు మీదకు ఎక్కి సెల్ఫీల కోసం దిషాన్ ప్రయత్నించాడు. అలా ప్రయత్నించిన సమయంలోనే పైన ఉన్న హైఓల్టేజ్ కరెంట్ తీగలు అతడికి తాకాయి. దాదాపు 25వేల వోల్టుల విద్యుత్ అతడి ఒంటి నుంచి ప్రవహించింది. ఫలితంగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రైల్వే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

తీవ్ర గాయాలతో కొట్టిమిట్టాడుతున్న అతడికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. మరో ఘటనలో ముగ్గురు కుర్రాళ్లు సెల్ఫీల కోసం ప్రయత్నిస్తూ గత వారం ప్రమాదానికి గురయ్యారు. ఆ ముగ్గురు కుర్రాళ్లు బైక్ పై వెళ్తూ.. ఓ వ్యక్తి బైక్ ను నడుపుతుండగా మరో ఇద్దరుకుర్రాళ్లు ఆ బైక్ పై నిలుచుని సెల్ఫీ కోసం ప్రయత్నించారు. బైక్ అదుపుతప్పడంతో ఆ ముగ్గురు కుర్రాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. సెల్ఫీల మోజుతో యువత పెడదోవ పడుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

First published:

Tags: Crime news, Crime story, CYBER CRIME, Karnataka, Train accident

ఉత్తమ కథలు