బోయినపల్లిలో విషాదం... చిన్నారి ప్రాణం తీసిన మైనర్ కారు డ్రైవింగ్

ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తులో మైనర్లు కారు నడపటమేనని గుర్తించారు పోలీసులు. హాసన్ అనే మైనర్ మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి కారును 150 కి.మీ. వేగంతో డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 19, 2019, 1:43 PM IST
బోయినపల్లిలో విషాదం... చిన్నారి ప్రాణం తీసిన మైనర్ కారు డ్రైవింగ్
మైనర్ల కారు డ్రైవింగ్
  • Share this:
హైదరాబాద్ బోయినపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14నెలల చిన్నారితోపాటు.. ఓ వృద్ధురాలు మృతి చెందింది. కూకట్ పల్లిలో ఉన్న బంధువులు ఇంటికి వెళ్లేందుకు నాగమణి ఆమె కూతురు సంధ్య మనవడు, ఆటో ఎక్కారు. ఆటోలో వెళ్తుండగా... బోయినపల్లి యాప్రాల్ సర్కిల్ వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో 14నెలల చిన్నారితో పాటు.. అమ్మమ్మ నాగమణి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. చిన్నారి తల్లి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదానికి కారణం మద్యం మత్తులో మైనర్లు కారు నడపటమేనని గుర్తించారు పోలీసులు. హాసన్ అనే మైనర్ మద్యం సేవించి తన స్నేహితులతో కలిసి కారును 150 కి.మీ. వేగంతో డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన వీరి కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. మరో రెండు బైకుల్ని ఈడ్చుకెళ్లింది. అనంతరం ఓ బండరాయిని ఢీకొని అక్కడ ఆగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కారులో స్థానికులు మద్యం బాటిల్స్‌ను కూడా గుర్తించినట్లు సమాచారం. దీంతో మైనర్ హాసన్‌తో పాటు అతని తండ్రి నూరుద్దిన్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న హాసన్ అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో అభం శుభం తెలియని చిన్నారితో పాటు అమ్మమ్మ కూడా ప్రాణాలు వదలడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మద్యం తాగి నిర్లక్యంగా కారును నడిపి ఇద్దరు ప్రాణాలు బలితీసుకున్న మైనర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.First published: August 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు