వృద్ధుడి అఘాయిత్యంతో బాలికకు గర్భం.. టెర్రస్ పై ప్రసవించి బిడ్డను ఏం చేసిందంటే..

దేశ రాజాధాని ఢిల్లీలో తాజాగా మరో దారుణం బయటకు వచ్చింది. అరవై ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. అయితే ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

news18-telugu
Updated: November 5, 2020, 2:04 PM IST
వృద్ధుడి అఘాయిత్యంతో బాలికకు గర్భం.. టెర్రస్ పై ప్రసవించి బిడ్డను ఏం చేసిందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట చిన్నారులపై దుర్మార్గాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. దేశ రాజాధాని ఢిల్లీలో తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. అరవై ఏళ్ల వృద్ధుడు 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్బం దాల్చింది. 9 నెలల అనంతరం ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేరానికి పాల్పడ్డ ఆ నిందితుడిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఓ 16 ఏళ్ల బాలికపై 9 నెలల క్రితం ఓ 60 ఏళ్ల వృద్ధుడు దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే భయంతో ఈ విషయాన్ని ఆ బాలిక ఎవ్వరితో చెప్పలేదు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. అయితే ఇటీవల ఆ బాలిక డాబాపై పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భయంతో ఆ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లి పోయింది.

వస్త్రంలో బిడ్డను చుట్టి ఉన్న విషయాన్ని గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెవళ్లారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై విచారణ నిర్వహించిన పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దీంతో ఓ బాలిక శిశువుతో ఉన్న విషయం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఆ బాలికను గుర్తించిన పోలీసులు ఈ విషయంపై ప్రశ్నించారు. దీంతో ఆ బాధితురాలు జరిగిన విషయాన్నంతా పోలీసులకు చెప్పింది.

ఆ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు 9 నెలల క్రితం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులకు ఆ బాలిక తెలిపింది. ఈ విషయం తల్లికి చెప్పేందుకు భయపడ్డానని చెప్పింది. ఈ క్రమంలోనే తాను ప్రసవించిన అనంతరం టెర్రస్ పై శిశువును వదిలి వెళ్లానంటూ వివరించింది. ఆ బాలిక చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు నిందితుడిని గుర్తించారు. అతడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు అధికారులు తెలిపారు. కాగా.. బాధిత బాలిక తల్లి స్థానికంగా పని మనిషిగా పని చేస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: November 5, 2020, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading