బాలికను ట్రాప్ చేసి.... 23రోజుల పాటు సెక్స్‌తో నరకం

అమ్మాయికి తనపై కాస్త నమ్మకం పెరిగిందన్న సమయానికి ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాలికను మాటల్లో దించి తనతో పాటు బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: October 9, 2019, 8:17 AM IST
బాలికను ట్రాప్ చేసి.... 23రోజుల పాటు సెక్స్‌తో నరకం
ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల వరకు జైలు శిక్ష
  • Share this:
కాలేజీకు వెళ్లి చదువుకుంటున్న ఆ అమ్మాయిపై ఆ కామాంధుడి కన్నుపడింది. ఎలా అయిన ఆమెను అనుభవించాలనుకున్నాడు. రోజూ ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. కాలేజీ దగ్గర ఆమె కోసం కాపు కాశాడు. మెల్లమెల్లగా పరిచయం పెంచుకొని ముగ్గులోకి దింపాడు. ఒకరోజు అమ్మాయికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారాం చేశాడు.అప్పటికీ వాడి మోజు తీరక బెదరిస్తూ మరికొన్నిసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 23రోజుల పాటు అమెను ఓ ప్రదేశంలో నిర్బంధించి బలవంతంగా రోజూ అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇక కాలేజీకి వెళ్లిన తమ కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడ ఇక్కడ తెలిసినవారిళ్లతో పాటు స్నేహితుల ఇళ్లల్లో ఆరా తీశారు. చివరకు పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక, వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో రోజూ అమలాపురంలోని కాలేజీకి వెళ్లి వస్తున్న సమయంలో ఈ బాలిక పై కన్నేసిన అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన తాడి రమేష్(21) అనే యువకుడు ఒక్కసారైన ఆ అమ్మాయిని అనుభవించాలనుకున్నాడు. అందుకోసం కొద్దిరోజుల పాటు ఆమె కాలేజీ వద్ద రెక్కీ నిర్వహిస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.అమ్మాయికి తనపై కాస్త నమ్మకం పెరిగిందన్న సమయానికి ఓ రోజు సాయంత్రం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బాలికను మాటల్లో దించి తనతో పాటు బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయినా ఆమెపై మోజుతీరక ఆ బాలికపై మళ్లీ మళ్లీ అత్యాచారం జరిపాడు. అలా బాలికను బెదిరిస్తూ వరుసగా 23 రోజుల పాటు నిర్భంధించాడు. 23 రోజుల పాటు రేప్ చేస్తూ అమ్మాయికి నరకం చూపించాడు.

కనిపించకుండాపోయిన తమ కూతురి కోసం గతనెల 5న పి.గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కోసం తీవ్రంగా గాలించారు. దీంతో ఆమె కిడ్నాప్‌కు గురైనట్లు తెలుసుకుని సెప్టెంబర్ 21న వెతికి పట్టుకున్నారు. బాలికపై పశువులా ప్రవర్తించిన రమేష్‌ను ఆదివారం అరెస్ట్  చేసి కోర్టులో హాజరపరిచారు. నిందితుడు రమేష్‌కు 14రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం అతడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

ఇవికూడా చూడండి:
బావిలో పడ్డ నాగుపాలు... నాలుగు నిమిషాల్లో బయటకు తీసిన యువతి
Published by: Sulthana Begum Shaik
First published: October 9, 2019, 8:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading