ఇంట్లో ఒంటరిగా ఉన్నవేళ... 16ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

ఇంట్లో అమ్మాయి ఒంటరిగా ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులెవరూ ఇంట్లో లేరు. దీంతో అదును చూసిన కామాంధుడు ఇంట్లోకి చొరబడ్డాడు.

news18-telugu
Updated: October 2, 2019, 12:02 PM IST
ఇంట్లో ఒంటరిగా ఉన్నవేళ... 16ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్న జరగాల్సిన దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఓ అమ్మాయి ఒంటరిగా ఉంది. ఆ సమయంలో తల్లిదండ్రులెవరూ ఇంట్లో లేరు. దీంతో అదును చూసిన కామాంధుడు ఇంట్లోకి చొరబడ్డాడు. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని బాందాలో నారాయిని ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి ఇట్లో ఒంటరిగా ఉన్న 16ఏళ్ల యువతిపై అదే ప్రాంతానికి చెందిన జహంగీర్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలితో పాటు.. యువకుడ్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by: Sulthana Begum Shaik
First published: October 2, 2019, 12:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading