దారుణ ఘటన.. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కామాంధుడు అత్యాచారం మరో ముగ్గురు కూడా..

దేశంలో పలుచోట్ల మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: September 13, 2020, 8:46 AM IST
దారుణ ఘటన.. 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కామాంధుడు అత్యాచారం మరో ముగ్గురు కూడా..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
దేశంలో పలుచోట్ల మృగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కామాంధుడు అత్యాచారం చేశాడు. అతనితో పాటు మరో ముగ్గురు కూడా బాలికపై లైంగిక దాడికి దిగాడు. వీరి వయస్సు 18 నుచి 28 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ ఘటన పాటియాలాలోని ఓ గ్రాసరీ షాప్ లోపల చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిందితులు గతంలో కూడా పలువురిపై అత్యాచారం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. గత నెలలో బాధిత బాలిక.. వారి ఇంటికి సమీపంలోని షాపులో గ్రాసరీ కొనేందుకు వెళ్లింది. ఆ గ్రాసరీ షాపు నిందితుల్లో ఒకరిది. బాధితురాలు షాప్ దగ్గర ఉన్న సమయంలో ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా లోనికి లాగాడు. అనంతరం మరో ముగ్గురి సాయంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని నిందితులు హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన బాధితురాలు.. ఈ విషయాన్ని చెప్పలేదు.

అయితే నిందితుడు బాధితురాలిని మళ్లీ వేధింపులకు గురిచేయడంతో.. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ప్రధాన నిందితుడితోపాటుగా, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అలాగే బాధితురాలికి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Published by: Sumanth Kanukula
First published: September 13, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading