• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 16 YEAR OLD GIRL MOLESTED BY FIVE YOUTHS IN DARBHANGA PHOTOS SHARED ON SOCIAL MEDIA NK

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం... నెట్‌లో ఫొటోలు షేరింగ్...

16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం... నెట్‌లో ఫొటోలు షేరింగ్...

(ప్రతీకాత్మక చిత్రం)

Bihar : రెగ్యులర్‌గా దారుణాలు జరిగే బీహార్‌లోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటన ఇప్పుడు ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

  • Share this:
    Patna : బీహార్‌లోని... దంర్భంగా జిల్లాలోని... ఓ గ్రామంలో జరిగిన దారుణం ఇది. ఐదుగురు కుర్రాళ్లు... 16 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. ఐతే... ఇది జరిగింది ఏప్రిల్ 24 రాత్రివేళ. తన ఇంటికి వెళ్తుండగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలికి సంబంధించిన నగ్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేరింగ్ అవ్వడంతో... జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఫొటోలను గమనించిన సైబర్ సేనాని గ్రూప్... పోలీసులకు మేటర్ చెప్పింది. అలర్టైన పోలీసులు... ఐదుగురు నిందితుల్లో నలుగుర్ని అరెస్టు చేశారు. బాధితురాలు పదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి ఓ వలస కూలీ. లాక్‌డౌన్ కారణంగా ఆయన... గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చిక్కుకుపోయాడు. కూతురి తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా... కేసు నమోదైంది.

    ఆ రాత్రి ఏమైందంటే : చీకట్లో ఇంటికి వస్తున్న బాలిక త్వరగా ఇంటికి వెళ్లాలి అనుకుంటూ వెళ్లసాగింది. ఇల్లు కాస్త దూరంలోనే ఉంది. ఇంతలో... ఓ రెండు నీడలు వెనకాలే వస్తున్నట్లు కనిపించింది. ఏంటా అని ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఆ నీడలు కూడా ఆ క్షణం ఆగాయి. బాలిక వాటిని చూడగానే... కళ్లు పెద్దవి చేసింది. ఊపిరి తీసుకోవడం ఆపేసింది. భయంతో అలా చూసిన ఆమె... తల దించుకొని... దిక్కులు చూడకుండా వేగంగా నడవడం మొదలుపెట్టింది. ఆ నీడలు కూడా వేగం పెంచాయి. ఆమె ఓ సందువైపు తిరుగుతుంటే... ఆ నీడలు ఒక్కసారిగా ఉరికి... బాలిక నోరు నొక్కేసి... బరబరా ఈడ్చుకుపోయాయి.

    ఓ 100 అడ‌ుగులు ఈడ్చుకుపోయాక... మరో మూడు నీడలు ఆ రెండు నీడలతో జత కలిశాయి. ఐదుగురూ బాలికను... ఏమాత్రం కదలనివ్వకుండా పట్టుకొని... ఈడ్చుకుంటూ... పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కుపోయారు. ఆ క్షణం ఆ బాలిక ఎంతగానో బతిమలాడింది. తనను వదిలెయ్యమంది. ఎంత చెప్పినా ఆ మృగాలు వినలేదు. ఒకరి తర్వాత ఒకరుగా దారుణానికి పాల్పడ్డారు.

    ఆ తర్వాత చంపేద్దామని డిసైడయ్యారు. తనను వదిలెయ్యమని కాళ్లపై పడి వేడుకుంది. బోరున ఏడ్చింది. ఎవరికీ చెప్పను అని మాట తీసుకున్నాక... వదిలేశారు. ఎవరికైనా చెబితే... ఇంటికొచ్చి మరీ అందర్నీ చంపుతామని బెదిరించారు. అలా ఆ క్రూర నీడల నుంచి ప్రాణాలతో బయటపడిన బాలిక... ఇంటికి వెళ్లినా... విషయం తల్లికి లేదా నాన్నమ్మ, తాతకు చెప్పలేదు.

    ఇన్ని రోజుల తర్వాత... ఐదుగురు నిందితుల్లో ఒకడు... ఆమె నగ్న ఫొటోలను తన ఫ్రెండ్స్‌కి షేర్ చేశాడు. వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిందితులపై ఐసీపీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. న్యూడ్ ఫొటోలను పోలీసులు డిలీట్ చేశారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు