తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలిక...

తండ్రి రోజూ తాగొచ్చి తన తల్లిని కొట్టడం చూసి ఆ బాలిక తట్టుకోలేకపోయింది. నయా పైసా సంపాదించని తండ్రి.. తాగుడుకు బానిసవ్వడమే గాక.. ఇంటికొచ్చి తరుచూ గొడవ చేస్తుండటంతో ఆ బాలిక ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

news18
Updated: October 23, 2020, 6:39 AM IST
తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలిక...
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 23, 2020, 6:39 AM IST
  • Share this:
తన తండ్రి రోజూ తాగొచ్చి తల్లిని హింసించడాన్ని ఆ బాలిక తట్టుకోలేకపోయింది. తల్లి పడే బాధలను తానూ పంటికింద భరించింది. ఇక మారతాడేమో అనుకుంటున్నా.. ఆ తండ్రిలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు చెప్పిచూసినా ఆయనలో మార్పు రాలేదు. గవ్వ సంపాధన లేదు కానీ.. తాగుడుకు మాత్రం తక్కువ లేదని తల్లి తిడుతున్నా.. ఆయనలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇంట్లో పెద్ద కొడుకు సంపాదన మీద బతుకుతున్న ఆ తండ్రి.. రోజూ తాగడానికి డబ్బులివ్వాలంటూ తల్లిని డబ్బులడగటం, ఇవ్వకుంటే ఆమెను కొట్టడం చూసిన పదహారేండ్ల బాలిక.. సహనం కోల్పోయింది. పక్కనే ఉన్న పెద్ద కర్రతో తండ్రి తల మీద గట్టిగా కొట్టడంతో ఆయన అక్కడికక్కడే రక్తం కక్కి చనిపోయాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన పదహారేండ్ల బాలిక.. తన తండ్రిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో.. బాలిక తండ్రి (45) తాగుబోతు. ఏ పని చేయకున్నా.. రోజూ తాగొచ్చి తల్లిని కొట్టేవాడు. ఇంట్లో పెద్ద కొడుకు చేసి సంపాదిస్తున్నాడు. కానీ ఆయన పనిచేసే డబ్బులు తన తాగడానికి ఇవ్వాలనేవాడు. ఇందుకు ఆ తల్లి నిరాకరించేది. ఈ క్రమంలో వారి పెద్ద కొడుకుకు పెళ్లి చేయాలనే విషయ మీద ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఇంటికి వచ్చిన ఆ బాలిక తండ్రి.. ఫుల్లుగా తాగి ఉన్నాడు. ఇంటికి రాగానే ఆమె తల్లితో గొడవ పడి ఆమెను కొట్టాడు. ఆమె తల్లి పడే బాధలు చూసి బాలిక తట్టుకోలేకపోయింది. అంతే.. పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రతో ఆ తండ్రి తలపై మోదింది.

దాంతో ఆ తండ్రి నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నా.. ఆ బాలిక కోపం చల్లారలేదు. తండ్రి తల నుంచి రక్తాలు కారుతున్నా.. తల్లి బాధలు తలుచుకుంటూ... ఆయన చనిపయేవరకు కొట్టింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి.. తండ్రిని తానే హత్య చేసినట్టు చెప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. బాలికను బాలల శిక్షా శిబిరానికి పంపించారు.

2014 లోనూ ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. బరేలికి చెందిన ఒక 14 ఏళ్ల బాలిక.. తండ్రే తనపై అత్యాచారం చేయబోతుండగా.. అక్కడ ఉన్న కర్రతో కొట్టి చంపింది.
Published by: Srinivas Munigala
First published: October 23, 2020, 6:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading