అర్ధరాత్రి 16 ఏళ్ల యువతి గదిలోకి దూరిన ఇద్దరు పిల్లల తండ్రి.. తెల్లారేసరికి ఇద్దరూ ఆస్పత్రి పాలు.. అసలు కథేంటో తెలిస్తే..

ప్రతీకాత్మక చిత్రం

16 ఏళ్ల యువతి విషయంలోనూ ఇదే జరిగింది. అర్ధరాత్రి ఆమె నిద్రపోతున్న గదిలోకి ఇద్దరు పిల్లల తండ్రి ఒకరు సైలెంట్ గా దూరాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. అసలు జరిగిన కథేంటో తెలిసి అంతా నిర్ఘాంతపోయారు.

 • Share this:
  కఠిన చట్టాలు ఎన్ని వస్తున్నా, స్త్రీలపై అఘాయిత్యాలకు మాత్రం అంతే లేకుండా పోతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా నెలల వయసు నుంచే ఆడ పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మూడేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయిన ఆడపిల్లలు ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ స్త్రీలను వదిలిపెట్టని కామాంధులు ఉన్నారు. తాజాగా ఓ 16 ఏళ్ల యువతి విషయంలోనూ ఇదే జరిగింది. అర్ధరాత్రి ఆమె నిద్రపోతున్న గదిలోకి ఇద్దరు పిల్లల తండ్రి ఒకరు సైలెంట్ గా దూరాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఇద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. అసలు జరిగిన కథేంటో తెలిసి అంతా నిర్ఘాంతపోయారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అతడికి ఇదేం పని అని అంతా ముక్కున వేలేసుకున్నారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ ప్రాంతంలో కరణ్ పోర్టే అనే ఓ వ్యక్తి ఉన్నాడు. అతడికి ఐదేళ్ల క్రితమే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చక్కగా భార్యతో కాపురం చేసుకోక, ఆడ పిల్లల వెంట పడటం మొదలు పెట్టాడు. అతడు ఉండే గ్రామంలోనే నివసించే ఓ 16 ఏళ్ల యువతిపై కరణ్ మోజు పడ్డాడు. ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ, పెళ్లి చేసుకుంటానంటూ మాయమాటలు, కల్లబొల్లి కబుర్లు చెప్పసాగాడు. అయితే అతడి నిర్వాకాలను మూగగానే ఆ యువతి భరించింది. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందనీ, తనను చదువుకోనివ్వరని ఆ యువతి భయపడింది. చాలా నెలల తరబడి అతడు వేధిస్తున్నా, అతడిని తిరస్కరించి పారిపోసాగింది. ఆ యువతి ప్రవర్తన పట్ల కరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఓ దారుణ నిర్ణయంతో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ యువతి ఇంటికి వెళ్లాడు.
  ఇది కూడా చదవండి: నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు

  ఆమె ఏ గదిలో నిద్రపోతుందో అతడికి ముందే తెలిసి ఉండటం వల్ల నెమ్మదిగా చడీ చప్పుడు చేయకుండా ఆమె గదిలోకి దూరాడు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన పోసి నిప్పంటించాడు. మంటలు తాళలేక ఆమె కేకలు పెట్టింది. అంతటి మంటల్లోనూ అతడి నిర్వాకాన్ని ఆ యువతి పసిగట్టింది. దీంతో ఆ యువతి కూడా ఆగ్రహంతో అతడి వైపునకు దూసుకొచ్చి, అతడికి మంటలను అంటించింది. అతడికి కూడా మంటలు అంటడంతో అక్కడ నుంచి పారిపోయాడు. దాదాపు 50శాతానికి పైగా యువతి ఒంటిపై గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆ యువతిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అతడు కూడా గాయాలకు చికిత్స నిమిత్తం అదే ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన పట్ల రాయ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నామనీ, చికిత్స పూర్తయిన తర్వాత అతడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. కాగా, యువతిపై ఇంతటి దారుణానికి తెగించిన అతడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్
  Published by:Hasaan Kandula
  First published: