హోమ్ /వార్తలు /క్రైమ్ /

video : ఇలాంటి ఘోరాన్ని ఎప్పుడైనా చూశారా? -గుద్దితే గాల్లోకి ఎగిరిపోతూ..

video : ఇలాంటి ఘోరాన్ని ఎప్పుడైనా చూశారా? -గుద్దితే గాల్లోకి ఎగిరిపోతూ..

జోధ్ పూర్ లో కారు బీభత్సం

జోధ్ పూర్ లో కారు బీభత్సం

రద్దీగా ఉన్నరోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన లగ్జరీ ఆడీ కారు.. బైకర్లను ఢీకొడుతూ దూసుకెళ్లింది. వరుసగా ఆరేడు బైకుల్ని ఢీకొట్టి.. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. గుడెసెలో జీవిస్తోన్న బాలుడు స్పాట్ లోనే చనిపోగా, గాయపడ్డ తొమ్మిది మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సీఎం తెలిపారు..

ఇంకా చదవండి ...

సడన్ గా ఆ వీడియోను చూస్తే.. యాక్షన్ సినిమాల్లో స్టంట్ సీనా? అనిపిస్తుంది! రద్దీ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు.. బైకర్లను గుద్దుకుంటూ దూసుకుపోగా.. ఒక్కొక్కరూ గాల్లోకి ఎగిరిపోయిన దృశ్యాలు.. కారు అదే స్పీడులో వెళ్లి రోడ్డు పక్కన గుడిసెను ధ్వంసం చేసిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో మంగళవారం జరిగిన ఈ ప్రమాదం తాలూకు వీడియో నెట్టింట వైరలైంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాలివి..

రాజ్రాజస్థాన్‌లో రెండో అతిపెద్ద సిటీ, ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన జోధ్ పూర్ లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సిటీలోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎయిమ్స్ రోడ్డులో ఆడీ లగ్జరీ కారు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉన్నరోడ్డుపై అతి వేగంగా దూసుకొచ్చిన ఆడీ కారు.. బైకర్లను ఢీకొడుతూ దూసుకెళ్లింది. వరుసగా ఆరేడు బైకుల్ని ఢీకొట్టి.. రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లిందా కారు.

ఆడీ కారు బీభత్సం తాలూకు దృశ్యాలు అక్కడున్న ట్రాఫిక్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ఢీకొట్టిన బైకర్లలో తొమ్మిది మందికి గాయాలు కాగా, గుడిసెలో నివసిస్తోన్న 16 బాలుడు దుర్మణం చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గాయపడ్డవాళ్లను ఆస్పత్రులకు తరలించి, కారును స్వాధీంన చేసుకున్నారు.

కారు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పరామర్శించారు. జైపూర్ నుంచి విమానంలో జోధ్ పూర్ కు వచ్చిన సీఎం నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. చనిపోయిన బాలుడి కుటుంబానికి పరిహారం అందిస్తామని సీఎం చెప్పారు. ప్రమాదానికి కారణమైన ఆడీ కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వివరాలను వెల్లడించలేదు.

Published by:Madhu Kota
First published:

Tags: Accident, Ashok gehlot, Car accident, Rajasthan

ఉత్తమ కథలు