ఒకటి, రెండు కిలోలు కాదు ..16వేల కిలోల (16 tonnes)మత్తు పదార్దం పట్టుబడింది. గంజాయి రవాణా కేవలం క్వింటాళ్లలో టన్నుల్లో చూశాం. కానీ అక్కడ 16 టన్నుల గంజాయిని ప్యాక్ చేసి మరీ రవాణాకు సిద్ధం చేశారు అక్రమార్కులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పట్టుబడిన గంజాయి స్మగ్లింగ్ కేసు(Smuggling case)లో ఇదే భారీ మొత్తంగా తెలుస్తోంది. గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ గంజాయి వ్యాపారాన్ని పసిగట్టిన మధ్యప్రదేశ్ (Madhya Pradesh)పోలీసులు నిఘా పెట్టి మరీ స్మగ్లర్లను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ (Indore)నగరంలోని ఓ గోడౌన్లో సిమెంట్, బస్తాలు, బియ్యం బస్తాలను నిల్వ చేసినట్లుగా గంజాయిని బస్తాల్లో ప్యాక్ చేసి దాచి పెట్టారు. పక్కా సమాచారం అందుకున్న ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ (Crime branch)పోలీసులు గోడౌన్‌పై రైడ్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి 16వేల కిలోలు ఉంటుందని...మార్కెట్లో దాని విలువ 50లక్షల (Worth Rs 50 lakhs)రూపాయలు పలుకుతుందని అధికారులు ప్రకటించారు. టన్నుల కొద్ది నిల్వ చేసిన ఈ గంజాయిని మూడో కంటికి తెలియకుండా అమ్మేందుకు ప్లాన్ వేసుకున్నారు అక్రమార్కులు. వైశాలీ నగర్(Vaishali nagar)లోని ఓ గోడౌన్(Godown)లో గంజాయిని బస్తాల్లో ప్యాక్ చేసి దాచిపెట్టారు.
గంజాయి స్మగ్లింగ్‌కి అడ్డాగా మారిందా..
ఈ గంజాయి స్మగ్లింగ్ కేసులో సరుకుతో పాటు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. నేరస్తులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాన్ని పసిగట్టడానికి ..నేరస్తుల్ని పట్టుకోవడానికి ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ పోలీసుల సహకారం కూడా తీసుకున్నట్లుగా అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురుప్రసాద్ పరాశర్ తెలిపారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని ఎక్కడ నుంచి తెచ్చారు..? ఎక్కడికి సప్లై చేస్తున్నారనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. వివరాలు తెలియగానే అందర్ని అరెస్ట్ చేస్తామన్నారు.
గతేడాది ఆంధ్రాలో..ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో..
భారత్‌లో మొక్కతో మొదలైన గంజాయి అక్రమ వ్యాపారం ఇప్పుడు ఓ వనంలా దేశ వ్యాప్తంగా పాకిపోయింది. మధ్యప్రదేశ్‌లో పట్టుబడిన 16వేల కిలోలే కాదు..తెలుగు రాష్ట్రాల్లో కూడా గంజాయిని క్షేత్రలుగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని 9మండలాల్లో గంజాయి సాగుకు అడ్డాగా మార్చుకున్నారు స్మగ్లర్లు. ఇక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. గతేడాదిలో 7,124 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశారు ఎస్ఈబీ అధికారులు. 2021లో ఒక్క విశాఖ జిల్లాలోనే 800కేసులు నమోదు చేశారు. 1879మందిని అరెస్ట్ చేశారు. 809వాహనాల్ని సీజ్ చేశారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో చేపట్టిన దాడుల్లో మొత్తం 122టన్నుల ఎండు గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపు 60కోట్ల రూపాయలకుపైగా ఉంటుంది. గతేడాదిలో విశాఖ ఏజెన్సీలో 1700కోట్ల రూపాయల విలువైన గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganja case, Madhya pradesh