పక్క పాకిస్తాన్లో మరోసారి బాంబుల మోత మోగింది. కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పాకస్తాన్‌లో మరో తీవ్ర బాంబుదాడి జరిగింది. శుక్రవారం ఉదయం క్వెట్టా సిటీ సమీపంలో ఉన్న ఓ పండ్ల మార్కెట్లో బాంబుదాడి జరిగింది. ఈ బాంబు దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బలూచిస్తాన్ ప్రావిన్షియల్ పోలీస్ అధికారులు తెలిపారు. క్వెట్టా సిటీలోని హజరంజీ ఏరియాకు చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఓ సెక్యూరిటీ అధికారి, పండ్ల మార్కెట్లో పని చేస్తున్న కార్మికులు ఆరుగురు చనిపోయినట్టు తెలిసింది. బలూచిస్థాన్‌లో ఉన్న క్వెట్టా సిటీలో ఉంటున్న హజరా కమ్యూనిటీని టార్గెట్ చేసుకునే, ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. బాంబు దాడి బీభత్సానికి చుట్టూ ఉన్న భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు ప్రాంతమంతా రక్తసిక్తమైంది. తెగి పడిన అవయవాలు, రక్తపు మరకలతో ఘటనా స్థలంలో బీతావహ వాతావరణం నెలకొంది. శుక్రవారం కావడంతో మార్కెట్‌కు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో జనాలు వచ్చాయి.
రద్దీగా ఉన్న ఏరియాలో బాంబు పేలుడు జరగడంతో తీవ్రంగా భారీగా కనిపించింది. బాంబు పేలుడు ఎవ్వరు చేసింది, ఎందుకు చేసింది వివరాలు ఇంకా తెలియరాలేదు. తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచకప్‌లో నిషేధించాలని భారత్ డిమాండ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ బాంబు దాడి... ఆ దేశంపై తీవ్రంగా పడే ప్రమాదం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb blast, International, Pakistan