బంధువే కదా అని వెంట వెళితే.. ఐదేళ్ల చిన్నారిని పొలాల్లొకి తీసుకెళ్లి లైంగిక దాడి

ప్రతీకాత్మక చిత్రం

భారత్ లో ఆడవారిపై లైంగికదాడులను నియంత్రించడానికి ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నా.. అవి వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి.

 • Share this:
  భారత్ లో ఆడవారిపై లైంగికదాడులను నియంత్రించడానికి ఎన్ని చట్టాలను తీసుకొస్తున్నా.. అవి వారికి రక్షణ కల్పించడంలో విఫలమవుతూనే ఉన్నాయి. ఆడవాళ్లపై, మైనర్ బాలికపై లైంగిక జరిగే అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతూనేఉన్నాయి. ముఖ్యంగా మైనర్ బాలికలపై, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ శాతం వారి బంధులో, తెలిసివారో ఉండటం సర్వత్ర ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో జరిగింది. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడు ఆ చిన్నారికి బంధువే. అయితే బాలికకు గాయాలు కావడాన్ని ఆమె తల్లికి తెలియడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

  నిందితుడు తొలత బాలికను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్మానుష్యంగా ఉన్న పొలాల్లొకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలు అయ్యాయి. ఆ తర్వాత తిరిగి బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి బాలిక తన గాయాలను తల్లికి చూపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాలిక తల్లి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే బాలికను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

  ఈ ఘటనపై జైపుర్ రేంజ్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. "నిందితుడు బాలిక పట్ల చాలాక్రూరంగా వ్యవహరించాడు. బాలికను ఆస్పత్రిలో చేర్పించాక ఆమెపై రేప్ జరిగినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే అల్వార్ సూపరిండెంట్ ఆఫ్ పోలీసు తేజస్వనీ గౌతమ్.. హాస్పిటల్‌కు వెళ్లి బాధితురాలని, ఆమె తల్లిని కలిశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ప్రస్తుతం బాధిత బాలిక ఆరోగ్య పరస్థితి నిలకడగా ఉంది"అని తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published: