బాలికపై 6 నెలలుగా అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఓనర్

ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమె గర్భంతో ఉన్నట్లు తేలింది.

news18-telugu
Updated: September 1, 2020, 5:26 PM IST
బాలికపై 6 నెలలుగా అత్యాచారం చేసి.. గర్భవతిని చేసిన ఓనర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చట్టాలంటే లెక్క లేకుండాపోయింది. శిక్షలంటే భయం లేకుండాపోయింది. దేశంలో ఆడవారి పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. చంపేస్తానని బెదిరించి ఓ మైనర్ బాలికపై ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడో ప్రబుద్ధుడు. జిల్లాలోని సింగరాయకొండ పట్టణంలోని బాలిరెడ్డినగర్‌లో ఈ ఘోరం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిరెడ్డి నగర్‌కు చెందిన బాధితురాలు (15) కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా యుగంధర్ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా పనిచేస్తోంది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న అతడు.. ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించి ఆరు నెలలుగా నరకం చూపిస్తున్నాడు.

ఇటీవల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురయింది. అంతేకాదు ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమె గర్భంతో ఉన్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిందితుడు యుగంధర్, అతడి భార్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి కఠిన శిక్ష విధించి.. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2020, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading