80 ఏళ్ల బామ్మపై 15 ఏళ్ల కుర్రాడి అత్యాచారయత్నం.. రెడ్ హ్యాండెడ్‌గా..

అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ 15 ఏళ్ల బాలుడు.. 80 ఏళ్ల వృద్ధురాలి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె నోట్లో బట్టలు కుక్కాడు.

news18-telugu
Updated: July 12, 2019, 7:46 PM IST
80 ఏళ్ల బామ్మపై 15 ఏళ్ల కుర్రాడి అత్యాచారయత్నం.. రెడ్ హ్యాండెడ్‌గా..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
80 ఏళ్ల బామ్మపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారయత్నం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బీహార్‌లోని మధుబని జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అయితే, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధుబని జిల్లాలోని జమాలియా గ్రామంలో గత బుధవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఓ 15 ఏళ్ల బాలుడు.. 80 ఏళ్ల వృద్ధురాలి మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. అయితే, ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న వారు లేచారు. నిందితుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహంతో గ్రామస్తులు అందరూ కలసి కొట్టడంతో ఆ బాలుడికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలి కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడి మీద కేసు నమోదుచేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. బాలుడిని జువైనల్ హోం‌కు తరలించారు. అయితే, ఆ బాలుడి వయసు 15 ఏళ్ల కంటే ఎక్కువగానే ఉంటుందని, అతడి వద్ద ఉన్న సర్టిఫికెట్లలో తప్పుడు వివరాలు పొందుపరిచారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత విచారణ జరుపుతామన్నారు.

First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>