అనాథ బాలికపై నిత్యం అత్యాచారం... దత్తతలోనూ చిత్రహింసలు... పారిపోయి వెళ్తే అక్కడ కూడా...

నోయిడాలో సెక్షన్ 18లో రోడ్డు పక్కన అపస్మారకస్థితిలో పడి ఉన్న ఓ 15 ఏళ్ల చిన్నారి... చేరదీసి అసలు విషయం కనుగొన్న NGO వాలెంటీర్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 9:30 PM IST
అనాథ బాలికపై నిత్యం అత్యాచారం... దత్తతలోనూ చిత్రహింసలు... పారిపోయి వెళ్తే అక్కడ కూడా...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 9:30 PM IST
న్యూఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథగా మారిన ఓ బాలికను... ఓ కుటుంబం దత్తత తీసుకుంది. మళ్లీ వారి రూపంలో తోడు దొరికిందని చిన్నారి సంతోషించేలోపే... పెంపుడు తల్లి తమ్ముడి రూపంలో రాక్షసత్వాన్ని రుచి చూడాల్సి వచ్చింది. నోయిడాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం క్రియేట్ చేసింది. నోయిడాలో సెక్షన్ 18లో రోడ్డు పక్కన ఓ 15 ఏళ్ల చిన్నారి అపస్మారక స్థితిలో పడుకోవడం చూసిన పాదచారులు... చైల్డ్ లైన్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న NGO సిబ్బంది వెంటనే... ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న బాలికను కౌన్సిలింగ్ చేసి... అసలేం జరిగిందనే విషయాలు తెలుసుకున్నారు NGO వాలెంటీర్లు.

ఆమె చెప్పిన విషయాలు విని... అందరూ షాక్ అయ్యారు. చిన్నారి తల్లిదండ్రులు కొన్నిరోజుల కిందట ప్రమాదంలో మరణించారు. ఒంటరిగా అనాథ అయిపోయిన బాలికను NGO సాయంతో ఇద్దరు భార్యాభర్తలు దత్తత తీసుకున్నారు. అయితే దత్తత తర్వాత బాలికతో ఇంటి పనులన్నీ చేయిస్తూ... పని పిల్లలా చూసుకునేవారు. అంతేగాక పెంపుడు తల్లి తమ్ముడు రోజూ లైంగిక దాడికి పాల్పడేవాడు. దాంతో చిత్రహింసలను భరించలేక అక్కడి నుంచి పారిపోయింది బాలిక. ఆ తర్వాత గురుగ్రామ్ చేరింది... అక్కడో ఇంట్లో ఉంది. ఎవ్వరూ లేని వృద్ధుల ఇంట్లో ఉంటే... అక్కడ ఉండే ఓ ముసలివాడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏం చేయాలో తెలియక అక్కడి నుంచి కూడా పారిపోయి ఢిల్లీ చేరింది చిన్నారి. ఎవ్వరినీ నమ్మాలో, నమ్మకూడదో తెలియక రోడ్డు పక్కన పడుకున్నానని చెప్పుకొచ్చిన బాలిక ధీనగాథ విని, అందరూ షాకయ్యారు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...