బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికోసం పారిపోయిన బాలిక.. కామాంధుల చేతికి చిక్కి...

ఆ సమయంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి రైళ్లు లేవని, ఉదయాన్నే రైళ్లు ఉంటాయని ఆటోడ్రైవర్ చెప్పాడు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదంటూ ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.

news18-telugu
Updated: February 12, 2019, 1:38 PM IST
బాయ్‌ఫ్రెండ్‌తో పెళ్లికోసం పారిపోయిన బాలిక.. కామాంధుల చేతికి చిక్కి...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 1:38 PM IST
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లిచేసుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయిన ఓ బాలిక కామాంధుల చేతికి చిక్కింది. ఆశ్రయం చూపిస్తామని తీసుకెళ్లిన దుండగులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అమృత్‌సర్‌లో ఈ ఘటన జరిగింది. పంజాబ్‌లోని లూధియానాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఓ అబ్బాయిని ఇష్టపడింది. ఢిల్లీ నుంచి తమ బంధువుల ఇంటికి లూధియానా వచ్చినప్పుడు యువకుడితో పరిచయం పెరిగింది. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.

delhi, new delhi, rape on 15 years girl, Orphan Girl, Orphan Girl Rape, Foster Mother, Mothers Brother, Chandigarh, దత్తత, బాలిక, బాలిక అత్యాచారం, రేప్, క్రైమ్ వార్తలు, చంఢీఘర్, ఢిల్లీ
నమూనా చిత్రం


ఇంట్లో నుంచి వచ్చేస్తే ఢిల్లీలో పెళ్లి చేసుకోవచ్చని బాయ్‌ఫ్రెండ్ సూచించాడు. దీంతో బాలిక ఇంట్లో రూ.1500 డబ్బులు దొంగతనం చేసి, బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. అయితే, పొరపాటున ఢిల్లీ వెళ్లాల్సిన ట్రైన్ ఎక్కకుండా ఫిరోజ్‌పూర్ రైలు ఎక్కింది. అక్కడి నుంచి మళ్లీ ఢిల్లీ వెళ్లడానికి అమృత్‌సర్ చేరుకుంది. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లడానికి రైళ్లు ఎప్పుడు ఉంటాయంటూ ఓ ఆటో డ్రైవర్‌ను అడిగింది. అదే ఆమె చేసిన తప్పు.

Bowenpally priest gets 10-year jail for sexually abusing minor
ప్రతీకాత్మక చిత్రం
ఆ సమయంలో అమృత్‌సర్ నుంచి ఢిల్లీకి రైళ్లు లేవని, ఉదయాన్నే రైళ్లు ఉంటాయని ఆటోడ్రైవర్ చెప్పాడు. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదంటూ ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆటో డ్రైవర్‌తోపాటు అతని ఫ్రెండ్ ఆమె మీద లైంగికదాడి చేశారు. ఆ తర్వాత ఉదయం ఆమెను లూధియానా బస్ ఎక్కించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

delhi kidnap, delhi crime news, minors kidnap, delhi police case, police story, crime stories, crime news, telugu crime stories, నేర వార్తలు, కిడ్నాప్ కలకలం
ప్రతీకాత్మక చిత్రం


లూధియానాలో దిగిన బాలిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...