బాలికపై యువకుడి అత్యాచారం... బంతిని ఎరగా వేసి...

ఓవైపు దేశం మొత్తం లాక్‌డౌన్ అయినా... నేరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచి కన్నేశాడో... ఆ బాలికపై అత్యాచారం చేశాడు.

news18-telugu
Updated: April 1, 2020, 11:25 AM IST
బాలికపై యువకుడి అత్యాచారం... బంతిని ఎరగా వేసి...
చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
  • Share this:
అది ఉత్తరప్రదేశ్... ముజఫర్‌నగర్. అక్కడో ఊరు. కొన్ని సందులు... వరుసగా ఇళ్లు. వాటిలో ఓ ఇల్లూ మాత్రం... కాస్త దూరంలో ఉంటుంది. ఆ ఇంట్లో గాలితనంగా తిరిగే ఓ కుర్రాడు ఉంటున్నాడు. లాక్‌డౌన్ తర్వాత... ఊళ్లో వాళ్లంతా ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండాలనీ... సామాన్ల కోసం మాత్రమే బయటకు రావాలనీ, ఉత్తినే ఊర్లో తిరిగితే మాత్రం ఊరుకునేది లేదని ఊరి పెద్దలు ఆదేశించారు. దాంతో అంతా ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమితం అయ్యారు. సందు చివర ఉండే కుర్రాడికి ఇంట్లో ఉండీ, ఉండీ బోర్ కొట్టింది. పోనీ బయటకు వెళ్దామా అంటే... ఎందుకు బయటకు వచ్చింది... స్థానికులకు చెప్పాల్సి ఉంటుందని అనుకున్నాడు. ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక ఇబ్బందిగా ఫీలయ్యాడు. అంతలో బయటి నుంచి సామాన్లతో ఓ 15 ఏళ్ల బాలిక తన ఇంటివైపుగా రావడం చూశాడు. చుట్టూ జనం ఎవరూ లేరు. అప్పటికప్పుడు ఓ కన్నింగ్ ఐడియా వేశాడు...

ఇంట్లోంచి ఓ బంతి, ఓ కత్తి తీసుకొచ్చాడు. బాలిక వస్తున్నప్పుడు బంతిని ఇంట్లోంచీ రోడ్డుపైకి వదిలాడు. బాలికను "హెలో... హెలో... కొంచెం ఆ బాల్ ఇవ్వా" అని అడిగాడు. ఓ చేతిలో సామాన్లు పట్టుకున్న ఆ బాలిక... మరో చేత్తో... బంతిని తీసి విసరబోతుంటే... చేతికి ఇచ్చేయమంటూ... బాలిక వైపు రెండడుగులు వేశాడు. బాలిక కూడా అతని వైపు నడుస్తూ వచ్చి... ఇంటి గేట్ దాకా వచ్చింది. బాల్ తీసుకుంటే... బాలిక చేతిని పట్టుకొని... ఇంటివైపు బలంగా లాగేశాడు. అరిస్తే కోస్తా అంటూ... కత్తిని మెడపై పెట్టాడు. అంతే... బాలికకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కుపోయాడు. తలుపు వేసేశాడు. సామాన్ల సంచి... వరండాలో పడిపోయింది.

అరగంట తర్వాత తలుపు తీశాడు. విషయం ఎవరికైనా చెబితే... చంపేస్తా అని బెదిరించాడు. బాలిక ఏడుస్తూ... కళ్లు తుడుచుకుంటూ... సంచిలోంచీ కిందపడిన సామాన్లను సంచిలో వేసుకొని... అతనివైపు భయంభయంగా చూస్తూ... గబగబా తన ఇంటివైపు వెళ్లిపోయింది.

ఇంటికి వెళ్లి ఏడుస్తూ... విషయం తల్లికి చెప్పింది. తల్లితోపాటూ... పక్క గదిలో ఉన్న తండ్రి కూడా ఏదో పని చేసుకుంటూ... విషయం విన్నాడు. అంతే... చూరులో ఉన్న కత్తిని తీశాడు. "ఖతం కరూంగా ఉస్‌కో" అంటూ ఆవేశంగా బయల్దేరాడు. అతన్ని ఆపేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కుర్రాడి ఇంటికి వెళ్లిన యువతి తండ్రి... మూసి ఉన్న గేటును కాలితో ఒక్క తన్ను తన్నాడు. "రేయ్" అంటూ అరుస్తూ... వెళ్లి... తలుపును బలంగా కొట్టబోయాడు. కానీ... తలుపుకి తాళం వేసి ఉంది. అప్పటికే చుట్టుపక్కల వాళ్లు తమ ఇళ్లలోంచీ బయటకు వచ్చి... కుర్రాడి ఇంటిదగ్గర పోగయ్యారు. అందరూ కలిసి... తలుపు బద్ధలు కొట్టారు. ఆ ఇంట్లో కుర్రాడు లేడు. ఆల్రెడీ పారిపోయాడని అర్థమైంది.

బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కేసు రాసి... ఆ కుర్రాణ్ని కనిపెట్టే పనిలో పడ్డారు.
Published by: Krishna Kumar N
First published: April 1, 2020, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading