హోమ్ /వార్తలు /క్రైమ్ న్యూస్ /

Teen Gives Birth to Baby: యూట్యూబ్ చూస్తూ డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక..పుటిన బిడ్డను ఏం చేసిందంటే?

Teen Gives Birth to Baby: యూట్యూబ్ చూస్తూ డెలివరీ చేసుకున్న 15 ఏళ్ల బాలిక..పుటిన బిడ్డను ఏం చేసిందంటే?

యూట్యూబ్ చూసి..

యూట్యూబ్ చూసి..

Teen Gives Birth to Baby: ప్రస్తుతం ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఫోన్ వాడకం తప్పనిసరిగా మారింది. సమయం దొరికిందంటే చాలు పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా..ఫోన్ లో తల పెట్టేస్తున్నారు. ఇక ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న కూడా యూట్యూబ్ ఉంది కదా అనే ధీమాతో ఉన్నారు. అయితే యూట్యూబ్ ను మంచి విషయాల కోసం వాడితే మంచిదే కానీ దొంగతనాలకు, ఏటీఎంలను కొల్లగొట్టడానికి, దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించిన సందర్భాలున్నాయి. కానీ ఓ 15 ఏళ్ల బాలిక యూట్యూబ్ లో చూస్తూ దారుణానికి పాల్పడింది. ఇంట్లో యూట్యూబ్ చూస్తూ తన సొంతంగా డెలివరీ చేసుకుంది. అంతేకాదు పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ట్రలో చోటు చేసుకుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఫోన్ వాడకం తప్పనిసరిగా మారింది. సమయం దొరికిందంటే చాలు పక్కన ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా..ఫోన్ లో తల పెట్టేస్తున్నారు. ఇక ఏ విషయం గురించి తెలుసుకోవాలన్న కూడా యూట్యూబ్ ఉంది కదా అనే ధీమాతో ఉన్నారు. అయితే యూట్యూబ్ ను మంచి విషయాల కోసం వాడితే మంచిదే కానీ దొంగతనాలకు, ఏటీఎంలను కొల్లగొట్టడానికి, దొంగ నోట్ల ముద్రణకు ఉపయోగించిన సందర్భాలున్నాయి. కానీ ఓ 15 ఏళ్ల బాలిక యూట్యూబ్ లో చూస్తూ దారుణానికి పాల్పడింది. ఇంట్లో యూట్యూబ్ చూస్తూ తన సొంతంగా డెలివరీ చేసుకుంది. అంతేకాదు పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ట్రలో చోటు చేసుకుంది.

Photos : తడోబా అడవిలో పులి ఫ్యామిలీ.. ఫొటోలు సూపర్ అంటున్న నెటిజన్లు

నాగ్ పూర్ లోని అంబజారి ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం కాస్త వారిద్దరిని మరింత దగ్గరకు చేర్చింది. దీనితో వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని బాలిక ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏమంటారో అని భయపడుతూ అలాగే ఉండిపోయింది. అయితే తనకు గర్భం అయిందన్న విషయాన్ని అనారోగ్యంగా చూపుతూ కాలం వెళ్లదీసింది. ఇక ఈ క్రమంలో తను ప్రెగ్నెంట్ అన్న విషయం బయటకు తెలియకూడదనే ఉద్దేశ్యంతో తానే డెలివరీ చేసుకోవాలని భావించింది. దేనికోసం యూట్యూబ్ ను ఎంచుకొని అందులో డెలివరీ వీడియోలను చూస్తూ తానే సొంతంగా డెలివరి చేసుకుంది. అయితే పాపకు జన్మనిచ్చిన విషయం ఎవరికి తెలియకూడదని దారుణానికి పాల్పడింది.

OMG: సెకన్ల వ్యవధిలోనే షాకింగ్ ఘటన... కానిస్టేబుల్ సమయస్పూర్తికి ఫిదా అవ్వాల్సిందే.. ఎక్కడంటే..

వీడియో చూస్తూ ప్రసవం చేసుకున్న ఆ 15 ఏళ్ల బాలిక పుట్టిన బిడ్డ పట్ల కర్కశంగా వ్యవహరించింది. అప్పుడే తల్లి కడుపులోనుంచి వెలుగులోకి వచ్చిన ఆ బిడ్డ ఇంకా పూర్తిగా తేరుకోకముందే తల్లి గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత ఇంట్లోనే ఓ డబ్బాలో మృతదేహాన్ని దాచింది. అయితే ఇంటికొచ్చిన బాలిక తల్లిందండ్రులు ఆమె అనారోగ్యంపై నిలదీశారు. అనుమానం రావడంతో గట్టిగా ప్రశ్నించారు. దీనితో జరిగిన విషయమంతా కూడా తల్లిదండ్రులకు బాలిక వివరించింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా 15 ఏళ్లకే ఆ బాలిక గర్భం దాల్చడం ఆపై తానే సొంతంగా డెలివరీ చేసుకొని బిడ్డను చంపేయడం స్థానికంగా కలకలం రేపింది.

First published:

Tags: Crime, Maharashtra, Video, Youtube

ఉత్తమ కథలు