అల్వార్‌లో మరో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై అత్యాచారం..

మే 14వ తేదీన అల్వార్‌లో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు సమాచారం.ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుల్లో ఇద్దరిని బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకోగా.. మరొకరు పరారయ్యారు.

news18-telugu
Updated: May 19, 2019, 11:16 AM IST
అల్వార్‌లో మరో గ్యాంగ్ రేప్.. మైనర్ బాలికపై అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 19, 2019, 11:16 AM IST
రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఓ దళిత మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన మరిచిపోకముందే మరో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల ఓ మైనర్ బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మే 14వ తేదీన అల్వార్‌లో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు సమాచారం.ఘటన జరిగిన మరుసటి రోజు నిందితుల్లో ఇద్దరిని బాధితురాలి కుటుంబ సభ్యులు పట్టుకోగా.. మరొకరు పరారయ్యారు. అయితే ఆ తర్వాత కొద్ది గంటలకే స్థానికంగా ఓ చోట రోడ్డు పక్కన అతను శవమై తేలాడు.

బాధితురాలి కుటుంబ సభ్యులు, హత్యకు గురైన యువకుడి కుటుంబ సభ్యులు వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మే 29న నిందితులను అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే, మరో ఘటనలో రాజస్తాన్‌లోని చురులో ఆరేళ్ల బాలికపై ఆమె బంధువైన 14ఏళ్ల మైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఘటనలో ధోల్‌పూర్‌లో 8 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైంది. మొత్తం మీద రాజస్తాన్‌లో చోటు చేసుకుంటున్న వరుస అత్యాచార ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.First published: May 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...