Home /News /crime /

15 YEAR OLD FOOTBALLER MOLESTED BY 2 TEENS JHARKHAND POLICE PAH

Shocking: మాట్లాడుకుందామని తీసుకెళ్లి.. ఫుట్ బాల్ క్రీడాకారిణిపై అత్యాచారం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jharkhand: బాలికతో సరదాగా మాట్లాడుకుందామని చెప్పి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బైక్ మీద మరో గ్రామానికి వెళ్లారు. అక్కడ బాలికపై అసభ్యంగా ప్రవర్తించారు.

కామాంధులు మహిళలు, అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాల పర్వాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. ప్రతిరోజు మహిళలపై వేధింపుల ఘటనుల వెలుగులోనికి వస్తునే ఉన్నాయి. దిశ, నిర్భయచట్టాలు తీసుకొచ్చిన, కొంత మంది వంకర బుద్ధి మాత్రం మారడం లేదు. 15 ఏళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారిణిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరలు.. జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది. రాంచీలో 15 ఏళ్ల బాలిక ఫుట్ బాల్ ఆడి తన ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో.. తెలిసిన అబ్బాయిలు ఆమెను కలవడానికి వచ్చారు. ఆమె కూడా వారితో బయటకు వెళ్లింది. అప్పుడు బైక్ పైన మరో గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ బాలికను ఒక ఇంటిలోనికి తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా అత్యాచారం చేశారు. ఎవరికైన చెబితే చంపుతామని చెప్పి.. గ్రామానికి సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు.



దీంతో యువతి జరిగిన దారుణాన్ని ఇంట్లో వారికి చెప్పింది. ఈ క్రమంలో.. బాధితురాలు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, 17 సంవత్సరాలు వయసున్న ఇద్దరు బాలురను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా పైలేట్ అని మాయమాటలు చెప్పి ఒక కేటుగాడు అనేక మందిని మోసం చేశాడు.

పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. హేమంత్ శర్మ అనే 25 ఏళ్ల కుర్రాడు వందల మంది అమ్మాయిలకు, మహళలకు ఫేస్ బుక్ ,ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. కొందరు అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్స్ ప్ట్ చేశారు. అయితే.. అతగాడు తాను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అంతే కాకుండా విదేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నట్లు అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. కొంత మంది ఇతగాడి ట్రాప్ లో పడ్డారు. అయితే.. అతను గురుగ్రామ్ కు చెందిన యువతికి కూడా ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమె దగ్గర నుంచి 1 లక్షకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసగాడని బయటపడింది. దీంతో అతను.. వెంటనే పారిపోయాడు.

ఈ క్రమంలో.. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. నిందితుడు.. హేమంత్ ను ఢిల్లీ శివారులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, సిమ్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో ఇప్పటి దాక.. 150 మంది మహిళలకు ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. అంతే కాకుండా.. మరో 30 మందితో డేటింగ్ లో ఉన్నట్లు తెలింది. దీంతో పోలీసుల అకౌంట్ లన్నింటికి డిలీట్ చేయించారు. పైలేట్ అని చెప్పుకుంటూ.. అవతలి వారిని మోసం చేసేవాడని పోలీసుల విచారణలో తెలింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Jharkhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు