HOME » NEWS » crime » 15 YEAR OLD DISABLED GIRL BRUTALLY GANG RAPED IN BIHAR EYES DAMAGED 3 MEN SRD

Crime : బీహార్ లో కీచక పర్వం ..దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం..చూపు కోల్పోయిన బాలిక

Crime : దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

news18-telugu
Updated: January 13, 2021, 5:59 PM IST
Crime : బీహార్ లో కీచక పర్వం ..దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం..చూపు కోల్పోయిన బాలిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై కీచక పర్వం కొనసాగుతూనే ఉంది. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు మృగాళ్ల కోరికలు విజృంభిస్తున్నాయి. వయస్సు తేడా లేకుండా చిన్న పెద్దా వ్యత్యాసం చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
దేశంలో వరుస నిర్భయ ఉదంతాలు మహిళ భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బీహార్ లోని మధుబాన్‌ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్‌ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన బాలిక తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు కామాంధులు రెచ్చిపోయారు. వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

దీంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బీహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Published by: Sridhar Reddy
First published: January 13, 2021, 5:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading