15 YEAR OLD DAUGHTER BECAME PREGNANT AFTER HER FATHER RAPED HER IN PRAKASHAM DISTRICT VB
Father and Daughter: కాటేసిన కనురెప్ప.. 15 ఏళ్ల కూతరుపై తండ్రి దారుణం.. చివరకు ఆమె ఐదు నెలల..
ప్రతీకాత్మక చిత్రం
Father and Daughter: అత్యాచారాలు ఆగడం లేదు. దుండగులు రెచ్చిపోతూనే ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురుపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఆమెపై పలుమార్లు ఘోరానికి పాల్పడ్డాడు.
చట్టాలంటే లెక్క లేకుండాపోయింది. శిక్షలంటే భయం లేకుండాపోయింది. దేశంలో ఆడవారి పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మృగాళ్లు చెలరేగిపోతూనే ఉన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఆరు నెలల పాప నుంచి నూట ఆరేళ్ల పండు ముసలవ్వ వరకు ఎవరినీ వదలడం లేదు. అంతే కాకుండా ఈ మధ్య సామూహిక లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే చంపేస్తామనడమో.. సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామనడమో ఎదో ఒకటి చెప్పి వాళ్లను బెదిరించి లొంగదీసుకుంటున్నారు. ఎక్కువగా ఈ మృగాళ్లు మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ సంఘటనలో పెంచుకున్న కనురెప్పే ఇక్కడ కాటేసింది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది. తండ్రి అనే బంధానికే మచ్చతెచ్చిన దారుణ ఉదంతమింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను పెంచిన చేతులతోనే ఆ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కామ పిశాచిలా మారాడు. 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా బాలికపై పలుమార్లు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. తల్లికి, మరెవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. కామాంధుడైన తండ్రి కర్కశత్వానికి బలైపోయిన బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి సమాచారం ఇలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఊరికి దూరంగా ఓ ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు. గత జనవరి నెలలో బాలిక తల్లి సరుకులు తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న సంగరపల్లి గ్రామానికి వెళ్ళింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న తండ్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన కామ వాంఛ తీర్చుకోవటానికి అభం శుభం తెలియని కూతురు జీవితాన్ని బలి చేశాడు. ఆ ఇల్లు ఇంటికి దూరంగా ఉండటంతో ఎవరికి చెప్పే వీలు లేకుండా పోయింది.
అప్పటి నుంచి పలు దఫాలుగా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని తల్లి , కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేయడంతో పాటుగా.. నిత్యం కొడుతూ వేధించేవాడు. ఈ క్రమంలో బాలికను తరచూ కొట్టడం.. అత్యాచారానికి పాల్పడటంతో ఆ బాలిక వేధింపులను భరించలేక సుమారు 20 రోజుల కిందట 100 నెంబర్ కు ఫోన్ చేసి తనకు సహాయం కవాలని పోలీసులను కోరింది. పోలీసులు వెళ్లి తండ్రిని మందలించి బాలికను తాత గారి ఇంటికి పంపించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన తండ్రి గురించి తెలుసుకున్న తాత, బాలిక ఐదు నెలల గర్భవతి అని తెలియటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.