పిల్లికూనను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన మైనర్ బాలురు

ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'ఇది పాకిస్తాన్..మహిళలు, మైనర్లు అయిపోయారు. ఇప్పుడు జంతువులను రేప్ చేస్తున్నారు.' అని మండిపడుతున్నారు. పిల్లికూనను రేప్ చేసి చంపేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 29, 2020, 7:23 PM IST
పిల్లికూనను గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన మైనర్ బాలురు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఘోరం.. దారుణం.. అమానుషం.. ఇలాంటి పదాలేవి సరిపోవు. అంతటి ఘోరాతి ఘోర ఘటన ఇది. మానవత్వానికే మచ్చ తెచ్చే దారుణ ఉదంతమిది. పిల్లికూనను గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు దుండగులు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలుడు.. మిత్రులతో కలిసి పిల్లి పిల్లపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమై ఆ పిల్లి చనిపోయింది. పాకిస్తాన్‌లోని జంతు హక్కుల సంఘం జేకే యానిమల్ రెస్క్యూ అండ్ షెల్టర్ (JFK Animal Rescue And Shelter) ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫేస్ బుక్‌లో పోస్ట్‌ చేసింది.

ఆ కథనం ప్రకారం.. ఓ ఇంట్లో పడి ఉన్న పిల్లి పరిస్థితిని చూసి స్థానికంగా ఓ ఉండే యువతికి అనుమానం వచ్చింది. ఆ ఇంట్లో ఉండే బాలుడిని నిలదీసింది. పిల్లి పిల్లను తనకు ఇచ్చేయమని అడిగింది. కానీ వారు అంగీకరించలేదు. ఐతే తీవ్ర గాయాలతో తల్లడిల్లుతున్న పిల్లిని చూసి ఆ యువతి చలించిపోయింది. ఎలాగోలా వారి నుంచి పిల్లిని కాపాడి వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లింది. దాని పరిస్థితిని చూసి డాక్టర్లు కూడా షాక్ తిన్నారు. శరీరంపై పలు చోట్ల గాయాలవడంతో పాటు దాని జననాంగం నుంచి వీర్యం, రక్తం కారడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

పిల్లిని బతికించేందుకు ఎంతో ప్రయత్నించినప్పటికీ.. ప్రాణాలు కాపాడలేకపోయారు. అశ్రు నయనాల మధ్య జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు ఆ పిల్లి మృతదేహాన్ని ఖననం చేశారు. అనంతరం ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'ఇది పాకిస్తాన్..మహిళలు, మైనర్లు అయిపోయారు. ఇప్పుడు జంతువులను రేప్ చేస్తున్నారు.' అని మండిపడుతున్నారు. పిల్లికూనను రేప్ చేసి చంపేసిన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: July 29, 2020, 7:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading