ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. బాలికపై పోలీసు అత్యాచారం..

Crime News: హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ కామాంధుడు(40).. ఇంట్లో మైనర్ బాలికను పనమ్మాయిగా పెట్టకున్నాడు. ఆమెను అనుభవించాలని చూసిన అతడు సరైన సమయం కోసం వేచి చూశాడు.

news18-telugu
Updated: July 26, 2019, 3:21 PM IST
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. బాలికపై పోలీసు అత్యాచారం..
లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై అత్యాచారం
  • Share this:
ఆపద వస్తే ఆదుకోవాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి అతడు.. కానీ, కామంతో కళ్లు మూసుకుపోయి కూతురి వయసున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో పని చేసే బాలికపై కన్నేసిన ఓ పోలీసు అధికారి.. ఎవరూ లేని సమయం చూసి ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. అక్కడి ముంద్కా ఏరియాలోని పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆ కామాంధుడు(40).. ఇంట్లో మైనర్ బాలికను పనమ్మాయిగా పెట్టకున్నాడు. ఆమెను అనుభవించాలని చూసిన అతడు సరైన సమయం కోసం వేచి చూశాడు. ఇంట్లో వాళ్లంతా వేరే ఊరికి వెళ్లడం అతడికి కలిసి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఆ హెడ్ కానిస్టేబుల్, బాలిక(14) తప్ప ఎవరూ లేరు.

దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె అరిచి కేకలు పెట్టడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోస్కో, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 26, 2019, 3:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading