Home /News /crime /

14 YEAR OLD MINOR BOY ARRESTED FOR SEXUAL ABUSE OF 4 YEAR OLD GIRL IN TUTICORIN IN TAMIL NADU MKS

Sexual Abuse: 4ఏళ్ల చిన్నారిపై 14ఏళ్ల బాలుడి లైంగిక అకృత్యం.. పాపకు స్నానం చేయిస్తుండగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లైంగిక దాడి ఆరోపణలపై 14 ఏళ్ల బాలుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొమ్మిదో తరగతి చదువుతోన్న ఆ బాలుడు తన పొరుగింట్లోని 4ఏళ్ల చిన్నారిని ఆటాడుకునే నెపంతో పొదల్లోకి తీసుకెళ్లి అకృత్యానికి పాల్పడ్డాడు..

చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు 14 ఏళ్ల బాలుడు కావడం కలవరపెట్టే అంశంగా ఉంది. తన ఇంటిపక్కనుండే పాపను ఆటాడుకునే నెపంతో తీసుకెళ్లిన బాలుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపకు తల్లి స్నానం చేయిస్తుండగా నొప్పంటూ ఏడవటంతో ఈ దారుణం బయటపడింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలో బాలుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విలాతికుళం ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాలివి..

తమిళనాడులోని తూత్తుకుడి (టుటికోరిన్) జిల్లాలో లైంగిక దాడి ఆరోపణలపై 14 ఏళ్ల బాలుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుకుడిలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతోన్న బాలుడు.. తన పొరుగింట్లో ఉండే బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొన్నాళ్ల సహజీవనం తర్వాత తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోగా బాలుడు తల్లి సంరక్షణలో ఉంటున్నాడు. కరోనా వల్ల మొన్నటిదాకా స్కూళ్లన్నీ మూతపడి ఉండగా, మొన్న శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Vava Suresh: కాపాడబోతే కాటేసిన కోబ్రా. ప్రముఖ Snake Catcher సురేశ్‌ పరిస్థితి విషమం..


నాలుగేళ్ల చిన్నారి, ఆమె సోదరుడు నిందితుడి ఇంటిపక్కనే ఉంటుంటారు. చాలాసార్లు కలిసి ఆటలాడుకునేవారు. మొన్న శనివారం కూడా ముగ్గురు పిల్లలు కలిసి ఆటాడుకుంటుండగా, కొత్త ఆటొకటి నేర్పిస్తానంటూ బాలికను ఇంటికి దగ్గర్లోని పొదలకు సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక అకృత్యానికి పాల్పడ్డాడా బాలుడు. ఘటన జరిగిన రోజు సాయత్రం..

Fire Accident In Kukatpally: ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. రోగులను కాపాడిన సెక్యూరిటీ గార్డులు-Hyderabad



తల్లి స్నానం చేయిస్తుండగా నొప్పితో బాలిక ఏడ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. భయంతో కంగారుపడ్డ తల్లి తన బిడ్డను తీసుకొని విలాతికుళం ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. బాలిక లైంగిక వేధింపులకు గురైనట్లు నిర్ధారించారు. ఆ వెంటనే తల్లి వెళ్లి విలాతికుళం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

Hyderabad : పగలు బిచ్చగాడు.. రాత్రయితే రాక్షసుడు: డబ్బులివ్వకుంటే అంతే సంగతి!



ప్రాథమిక దర్యాప్తులో నేరానికి సంబంధించి ఆధారాలు లభించడంతో పోలీసులు బాలుణ్ని ఆదివారం నాడు అరెస్టు చేశారు. మైనర్ కావడంతో అతణ్ని తిరునెల్వేలిలోని చైల్డ్ హోం కేర్ కు తరలించారు. ఐపీసీ, పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, బాలుడిపై కోర్టు విచారణ ఉంటుందని పోలీసులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: Minor girl raped, School boy, Tamil nadu

తదుపరి వార్తలు