Minor Rapedy by Neighbour: యూపీలో ఆగని ఆకృత్యాలు.. మరో బాలికపై అత్యాచారం

ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే.. బులంద్ షహర్ లో మరో మైనర్ అత్యాచారానికి గురైంది.

news18
Updated: October 1, 2020, 2:27 PM IST
Minor Rapedy by Neighbour: యూపీలో ఆగని ఆకృత్యాలు.. మరో బాలికపై అత్యాచారం
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 1, 2020, 2:27 PM IST
  • Share this:
దేశంలో ఏ మూలకు వెళ్లినా మహిళలకు భద్రత కరువవుతున్నది. కొద్దిరోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత యువతిని సామూహికంగా అత్యాచారం చేయగా.. ఆమె చనిపోయిన ఘటన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రముఖులతో పాటు సాధారణ జనం కూడా ఈ హేయమైన ఘటనపై స్పందిస్తున్నారు. మరోవైపు దేశంలో బుధవారం ఇవే తరహా కేసులు మరో నాలుగు వెలుగులోకి వచ్చాయి. బలరాంపూర్ లోనూ మరో దళిత యువతి రేప్ కు గురై చనిపోగా.. రాజస్థాన్ లో ఇద్దరు మైనర్ బాలికలు.. గ్యాంగ్ రేప్ కు గురయ్యామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉండగానే.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లో మరో లైంగికదాడి ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

వివరాలిలా.. యూపీలోని బులంద్ షహర్ లోని కకోరే గ్రామానికి చెందిన 14 ఏండ్ల బాలికపై.. ఆమె ఇంటి పక్కన ఉంటున్న యువకుడు అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేప్ కు గురైన బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

యూపీలో వరుసగా మహిళలు, యువతులపై లైంగికదాడులు జరుగుతుండటంతో సీఎం యోగి ఆదిత్యానాథ్.. దీనికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 1, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading