Home /News /crime /

14 YEAR OLD DIES AFTER ALLEGED MOLESTED AT BIRTHDAY PARTY FORCIBLY CREMATED SON OF TMC LEADER HELD GOES VIRAL PAH

Shocking: బర్త్ డే వేడుకలకు పిలిచి.. బాలికపై సాముహిక అత్యాచారం.. నిందితులలో టీఎంసీ కీలక నేత కొడుకు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Bengal: బాలికను బర్త్ డే పార్టీకి ఆహ్వానించారు. ఆపై తోటి స్నేహితులే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. తిరిగి ఇంటికి చేరుకునే సరికి బాలిక ఒంటిపై తీవ్రమైన గాయాలు, రక్తస్రావం అవ్వడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు.

Minor Girl Dies molested at Birthday Party: వెస్ట్ బెంగాల్ లో దారుణమైన ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. తోటి స్నేహితులే బాలిక పట్ల కీచకులుగా మారారు. ఆమెను బర్త్ డే పార్టీ పేరిట ఇంటికి ఆహ్వానించారు. ఆ తర్వాత.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తాగించారు. ఈ క్రమంలో ఆమె అపస్మారక స్థితిలోనికి చేరుకొగానే సాముహికంగా అఘాయిత్యానికి తెగబడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది.

సమాజంలో.. మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులను (Molested on Woman) నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులలో మార్పులు రావడం లేదు. ఇప్పటికి మహిళలు, యువతులను టార్గెట్ చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో.. మహిళల భద్రత పెద్ద సమస్యగా మారింది. వారు.. స్కూళ్లలో, ఆఫీసులలో, బస్టాండులలో ప్రతి చోట వేధింపులకు గురౌతున్నారు. కొందరు కేటుగాళ్లు.. మహిళలను బస్టాండులలో, బస్సులలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

మహిళలను చూసుకుంటూ వెకిలీ చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కన్నవారే.. తమ పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పసి పాపల నుంచి పండు ముసలి వరకు కామాంధులు ఎవరిని వదలడం లేదు. ఇక స్కూళ్లలోను తోటి బాలికలు అఘాయిత్యాల బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల టీచర్ లే కామాంధులుగా మారగా, మరికొన్ని చోట్ల విద్యార్థులు కూడా పార్టీల పేరిట లైంగిక దాడికి పాల్పడుతున్నారు.

పూర్తి వివరాలు.. వెస్ట్ బెంగాల్ లోని (West bengal)నదియా జిల్లాలో దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థులు తోటి విద్యార్థినిని బర్త్ డే వేడుకలకు ఆహ్వానించారు. ఆ తర్వాత.. బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత.. బాలిక ఇంటికి చేరుకునే సరికి అపస్మారక స్థితిలో ఇంటికి చేరుకుంది. బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. బాలిక తల్లిదండ్రులు అపస్మారక స్థితిలోనికి చేరుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి  చెందిందని తెలిపారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బాలికపై సాముహిక అత్యాచారం చేశారని  (Birthday Party tragedy) ఆరోపించారు. ఈ ఘటనలో స్థానిక టీఎంసీ నాయకుడి కుమారుడు ఉన్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు.. బ్రజగోపాల్ ను అరెస్టు చేశారు. అయితే, తొలుత పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేయడానికి ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గత వారం జరిగింది. బాధితురాలిని ఇంటికి తీసుకు రాగానే కొంత మంది స్థానిక నాయకులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కనీసం పోస్ట్ మార్టం నివేదిక రాక పూర్వమే, బాధిత కుటుబ సభ్యులను గందర గోళానికి గురిచేశారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేకెత్తిస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Harassment, West Bengal

తదుపరి వార్తలు