news18-telugu
Updated: November 20, 2020, 8:37 AM IST
నుజ్జునుజ్జయిన కారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి వేళ ట్రక్కును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రతాప్‌గఢ్ జిల్లా ప్రయాగ్ రాజ్-లక్నో హైవేపై మాణిక్పూర్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరోలో ఉన్న వారంతా ఓ పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. నిన్న జరిగిన బరాత్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేయడంతో బాగా అలిసిపోయారు. ఈ క్రమంలోనే ప్రయాణ సమయంలో గాఢ నిద్రలోకి జారుకున్నారు. డ్రైవర్ కూడా నిద్రపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బొలెరో వాహనం వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి లారీ బోల్తా పడింది. బొలెరో వాహనం నుజ్జునుజ్జవడంతో అందులోని ప్రయాణికులు మరణించారు. ఒకరు మినహా అందరూ స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ కట్టర్ సాయంతో బొలెరో భాగాలను కట్ చేసి..మృతదేహాలను బయటకు తీశారు.
రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
Published by:
Shiva Kumar Addula
First published:
November 20, 2020, 8:32 AM IST