కడపలో విషాదం.. టీవీ రిమోట్‌ కోసం అక్కతో కొట్లాడి.. చెల్లి ఆత్మహత్య

అక్క తిట్టినందుకు ఆమె చెల్లి సాయి లక్ష్మి (13) తీవ్ర మనస్థాపానికి గురయింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది

news18-telugu
Updated: May 6, 2020, 7:35 PM IST
కడపలో విషాదం.. టీవీ రిమోట్‌ కోసం అక్కతో కొట్లాడి.. చెల్లి ఆత్మహత్య
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రస్తుతం సమాజంలో ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. చిన్నపాటి కారణాలకే ప్రాణం తీసుకుంటున్నారు. తాజాగా కడప జిల్లాలో బద్వేల్‌లో విషాదం చోటుచేసుకుంది. టీవీ రిమోట్ కోసం అక్కతో కొట్లాడి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం టీవీ చూస్తున్న సమయంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అక్క తిట్టినందుకు ఆమె చెల్లి సాయి లక్ష్మి (13) తీవ్ర మనస్థాపానికి గురయింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలులముకున్నాయి. బాలిక ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 6, 2020, 7:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading