• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • 13 YEAR OLD MUMBAI GIRL ABDUCTED RAPED BY SOCIAL MEDIA FRIEND BN

ఫేస్‌బుక్‌లో స్నేహం పేరుతో నమ్మించి.. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి..

ఫేస్‌బుక్‌లో స్నేహం పేరుతో నమ్మించి.. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి..

(ప్రతీకాత్మకచిత్రం)

ఓ యువకుడి(22)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే సదరు యువకుడు ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి రాజస్థాన్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

  • Share this:
    ఇంటర్ నెట్ వినియోగం రోజురోజూకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వాడడంలో చిన్నా పెద్దా అన్న వ్యత్యాసమేమీ ఉండట్లేదు. అయితే ఈ క్రమంలోనే అది అనర్థాలకు దారి తీస్తోంది. సెంట్రల్ ముంబైలోని అగ్రిపాడాకు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక ఫేస్‌బుక్‌లో ఎక్కువ సేపు గడిపేది. ఈ క్రమంలోనే ఓ యువకుడి(22)తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అయితే సదరు యువకుడు ఆ బాలికను నమ్మించి కిడ్నాప్ చేశాడు. ఆపై నలుగురు స్నేహితులతో కలిసి రాజస్థాన్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అయితే జూలై ఒకటో తేదీన సదరు బాలిక కనపడకపోవడంతో పోలీసులకు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఫేస్‌బుక్‌లో ఓ యువకుడితో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించారు.

    దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు రాజస్థాన్‌లోని జల్వాడ్, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌కు వెళ్లి అత్యాచారం చేసిన ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను సురక్షితంగా ఆమె తల్లికి అప్పగించారు. అయితే కరోనా వైరస్ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ బాలికను రాజస్థాన్ తరలించేందుకు ఉపయోగించిన వాహనాన్ని ఎక్కడా అడ్డుకోకపోవడం గమనార్హం. 13 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసిన నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
    Published by:Narsimha Badhini
    First published: